మైసూరు: తక్కువ ధరకు ఫర్నిచర్ అందిస్తామని ఓ ఉపాధ్యాయిని దంపతుల నుంచి రూ.1.73 లక్షలను దోచుకున్నారు. వివరాలు.. మైసూరు సిద్ధార్థనగర్ నివాసి అయిన ఉపాధ్యాయిని గీతా, ఆమె భర్త సమాజ సేవకుడు. ఓ ఐఏఎస్ అధికారి బదిలీ అవుతున్నారు. వారి ఇంటిలోని ఫర్నిచర్‌ను తక్కువ ధరకు విక్రయిస్తున్నారనే పోస్టును గీత భర్త ఫేస్‌బుక్‌లో చూసి, ఆ నంబరుకు కాల్ చేశాడు. రూ.90 వేలకు ఫర్నిచర్ కొనుగోలుకు అంగీకరించారు. డబ్బు పంపగానే వాహనంలో ఫర్నిచర్‌ను పంపిస్తానని నమ్మబలికారు. బాధితుడు భార్య ఖాతా నుంచి రూ.90 వేలు బదలాయించాడు. ఆ సొమ్ము జమ కాలేదు, మరో రూ.83 వేలను చెల్లించాలని, ఆ మొత్తాన్ని తర్వాత వాపసు చేస్తామని వంచకుడు చెప్పగా సరేనని ఆ డబ్బును కూడా పంపించాడు. మోసగాడు మరింత డబ్బు కావాలని డిమాండ్ చేయగా గీతా దంపతులకు అనుమానం వచ్చింది. దీంతో అతనిని ప్రశ్నించేందుకు ప్రయత్నించగా ఫోన్ స్విచాఫ్ అయింది. బాధితులు నజర్‌బాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment