కొత్త ఏడాది వేడుకల్లో అల్లర్లకు కుట్ర
బనశంకరి: ఇటీవలి రోజుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెచ్చుమీరాయి. న్యూ ఇయర్ వేడుకలలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూసుకోవాలని పోలీస్ అధికారులకు నగర పోలీస్ కమిషనర్ బీ.దయానంద్ సూచించారు. సోమవారం నగరంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. న్యూ ఇయర్ సంబరాలకు అన్ని ఏర్పాట్లు చేశాము. 36 అంశాలపై మార్గదర్శకాలను రూపొందించాం. వేడుకలలో అల్లరి మూకలు పెట్రేగే అవకాశం ఉంది, అలాంటి వారి పట్ల జాగ్రత్త వహించి గట్టి చర్యలు తీసుకోవాలి. న్యూ ఇయర్‌ను వ్యతిరేకించే సంఘ సంస్థలపై నిఘా సంస్థలు కన్నేసి ఉంచాలి. మాల్స్‌లో సీసీ కెమెరాలు అమర్చి నిఘా పెంచాలన్నారు.
తుపాకులు,
లాఠీలు సిద్ధం
పోలీసు అధికారులు అందరూ సర్వీస్ రివాల్వర్ కచ్చితంగా ధరించాలి. పోలీస్ సిబ్బంది హెల్మెట్, లాఠీలను వెంట ఉంచుకోవాలని సీపీ ఆదేశించారు. వేడుకలలో అల్లరి మూకలను, ఆడపిల్లలను వేధించేవారిని తక్షణం అదుపులోకి తీసువాలని సీపీ ఆదేశించారు. వైన్ షాపుల వద్ద గొడవలు, దొమ్మీ, బాటిల్స్ పడేయటం, మహిళలపై వేధింపులకు పాల్పడితే షాపుల యజమానులదే బాధ్యత అన్నారు.
ఆ రోజున ఫ్లై ఓవర్లు బంద్
ప్రముఖ రోడ్లలోను, ఫ్లై ఓవర్ల మీద 31న వాహనాల సంచారం నిషేధమన్నారు. గస్తీని ముమ్మరం చేయాలన్నారు. ప్రజలు అధికంగా చేరే రోడ్లు, కూడళ్లలో సీసీ కెమెరాలను తప్పనిసరిగా అమర్చాలి. వీధి దీపాలు పనిచేసేలా చూసుకోవాలన్నారు. ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, చర్చ్ స్ట్రీట్‌తో పాటు ప్రజలు గుమికూడే ప్రదేశాలలో భద్రతను బలోపేతం చేయాలని తెలిపారు. మొత్తంగా కొత్త ఏడాది సంబరాలలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకోకుండా చూడాలని ఆదేశించారు.
నగరంలో పటిష్టమైన భద్రత
పోలీసు కమిషనర్ దయానంద్ వెల్లడి
వేడుకలను వ్యతిరేకించే సంస్థలపై కన్ను
Comments
Please login to add a commentAdd a comment