సిలికాన్‌ సిటీపై సైబర్‌ నేరగాళ్ల పంజా | - | Sakshi
Sakshi News home page

సిలికాన్‌ సిటీపై సైబర్‌ నేరగాళ్ల పంజా

Published Fri, Nov 8 2024 1:12 AM | Last Updated on Fri, Nov 8 2024 1:12 AM

సిలిక

సిలికాన్‌ సిటీపై సైబర్‌ నేరగాళ్ల పంజా

బనశంకరి: ప్రపంచ స్థాయిలో సిలికాన్‌ సిటీగా ఖ్యాతి ఘడించిన బెంగళూరులో సైబర్‌ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. షేర్లలో పెట్టుబడి పేరుతో విద్యావంతులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులను టార్గెట్‌గా చేసుకుని లక్షలాది రూపాయలు దోచేస్తున్న ఘటనలు షరా మామూలుగా మారిపోతున్నాయి. బెంగళూరు నగర పోలీసులు ఎంత జాగృతం చేస్తున్నప్పటికీ వంచనలు మాత్రం ఆగడంలేదు. నిత్యం పెద్దసంఖ్యలో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

నకిలీ షేర్ల వ్యాపారంలో మునిగి..

నగరంలో మల్లేశ్వరంలో ఉమాపతి బసణ్ణరడ్డేర్‌ అనే వ్యక్తికి షేర్ల వ్యాపారంలో పెట్టుబడి పేరుతో రూ.44.72 లక్షలు టోపీ వేశారు. వివరాలు.. గత సెప్టెంబరులో జెరోదా ట్రేడింగ్‌ కంపెనీ ప్రతినిధులమని పరిచయం చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు మార్కెట్‌ మాస్టర్‌ అనే వాట్సాప్‌ గ్రూప్‌లో ఉమాపతిని సంప్రదించారు. షేరుమార్కెట్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభం లభిస్తుందని ఆశ చూపించారు. ఓటీసీ ఖాతాలో షేర్‌ట్రేడింగ్‌ చేయాలని సూచిస్తూ వాట్సాప్‌ ద్వారా యాప్‌ లింక్‌ పంపించారు. బాధితుడు నమ్మేసి బ్యాంకు అకౌంట్ల నుంచి వారి ఖాతాల్లోకి పలు దఫాల్లో రూ.44.72 లక్షలు జమచేశాడు. కొన్నిరోజుల తరువాత వారిని సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. డబ్బు వెనక్కి తీసుకుందామంటే యాప్‌ బ్లాక్‌ అయ్యింది. నిండా మునిగిపోయినట్లు గుర్తించి కేంద్ర విభాగ సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

స్టాక్‌ మార్కెట్‌ పేరుతో రూ.74 లక్షలు స్వాహా

షేర్‌ మార్కెట్‌లో పేరుతో మహిళ నుంచి రూ.74 లక్షలు దోచేశారు. బాధితురాలు బనశంకరివాసి. ఇంటర్నెట్‌లో షేర్ల ప్రకటన రాగా ఆమె క్లిక్‌ చేసింది. యాప్‌లో తన వివరాలు నమోదు చేసింది. కొన్ని నిమిషాల తరువాత గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి ఫలానా కంపెనీ ఏజెంట్‌ అని పరిచయం చేసుకుని షేర్లలో డబ్బులు పెడితే కొన్నిరోజుల్లోనే లక్షలాది రూపాయల లాభం వస్తుందని మభ్యపెట్టాడు. అతని మాటలు నమ్మిన మహిళ ముందుగా రూ.1.4 లక్షలు , రెండోసారి రూ.6.7 లక్షలు పెట్టుబడి పెట్టింది. అలాగే మరో ప్రకటన గమనించి ఇందులో రూ.67 లక్షలు పెట్టుబడి పెట్టి వంచనకు గురైంది. మొత్తం 74 లక్షలు కోల్పోయినట్లు సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది.

విశ్రాంత ఉద్యోగికి రూ.19 లక్షలు..

ప్రైవేటు కంపెనీ విశ్రాంత ఉద్యోగి షేర్‌మార్కెట్‌లో పెట్టుబడి పెడితే అదిక ఆదాయం వస్తుందని నమ్మి రూ.19 లక్షలు పోగొట్టుకున్నాడు. కొద్దిరోజుల క్రితం ఆయనను కొందరు మోసగాళ్లు తమ టెలిగ్రాం గ్రూప్‌లో చేర్చారు. అందులో షేర్ల వ్యాపారం గురించి చర్చించేవారు. ఆశపడిన బాధితుడు వారు సూచించిన ఖాతాల్లోకి రూ.19 లక్షలు జమచేశాడు. కానీ పెట్టుబడి, లాభం ఏదీ రాకపోగా, దుండగులు ఆయనను బ్లాక్‌ చేశారు. కేంద్ర విభాగం సీఈఎన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

మాయమాటలతో జనం సొమ్మును కొట్టేస్తున్న సైబర్‌ మోసగాళ్లు

న్యూస్‌రీల్‌

షేర్లలో పెట్టుబడి పేరుతో

రూ.44.72 లక్షలు టోకరా

ఓ మహిళకు రూ. 56 లక్షలు, మరో మహిళకు రూ. 74 లక్షలు టోపీ

జనం అమాయకత్వమే

సైబర్‌ నేరగాళ్లకు వరం

టాస్కులు ఇచ్చి మహిళకు రూ.56.57 లక్షలు..

బ్రాండెడ్‌ దుస్తుల ప్రకటనకు పిల్లల్ని ఎంపిక చేస్తున్నాని, జూనియర్‌ ఫ్యాషన్‌ షో ఏర్పాటు చేస్తామని చెప్పి మహిళ నుంచి రూ.56.57 లక్షలు దోచుకున్నారు. బనశంకరి మొదటి స్టేజ్‌ కు చెందిన గృహిణి గత నెల 7 తేదీన ఫేస్‌బుక్‌లో పర్ఫెక్ట్‌ జూనియర్‌ అనే ప్రకటనను చూసింది. ఇందులో పిల్లల బ్రాండెడ్‌ దుస్తులతో ఫ్యాషన్‌ షో ఏర్పాటుచేస్తామని, మీ పిల్లలను పంపించవచ్చునని ఉంది. ఆ మహిళ ఆ పోటీలకు తన కుమార్తెను పంపించడానికి నమోదుచేసుకుంది. ఆ తరువాత సైబర్‌ వంచకులు ఆమెను ఓ టెలిగ్రాం గ్రూప్‌లో చేర్చి టాస్క్‌లు ఇచ్చారు. సరళమైన ప్రశ్నలకు సమాధానమిస్తే చాలు బాగా కమీషన్‌ ఇస్తున్నట్లు చెప్పారు. ఆమె వారి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని కొద్దిగా నగదు పెట్టుబడి పెట్టగా కొంతమొత్తం కమీషన్‌ వచ్చింది. ఎక్కువ డబ్బు పెట్టుబడి పెడితే ఇంకా లాభం వస్తుందని ఆశకు పోయిన ఆమె అప్పులు చేసి రూ.56.57 లక్షలను మోసగాళ్లకు పంపించింది. బాగా లాభం వచ్చినట్లు అప్లికేషన్‌లో చూపించారు. డ్రా చేయడానికి ప్రయత్నించగా సాధ్యం కాలేదు. ఫోన్‌ చేస్తే కట్‌ చేయసాగారు. దీంతో బాధితురాలు లబోదిబోమంటూ దక్షిణ విభాగ సీఈఎన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
సిలికాన్‌ సిటీపై సైబర్‌ నేరగాళ్ల పంజా1
1/3

సిలికాన్‌ సిటీపై సైబర్‌ నేరగాళ్ల పంజా

సిలికాన్‌ సిటీపై సైబర్‌ నేరగాళ్ల పంజా2
2/3

సిలికాన్‌ సిటీపై సైబర్‌ నేరగాళ్ల పంజా

సిలికాన్‌ సిటీపై సైబర్‌ నేరగాళ్ల పంజా3
3/3

సిలికాన్‌ సిటీపై సైబర్‌ నేరగాళ్ల పంజా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement