హెబ్బాళ ట్రాఫిక్ రద్దీకి చెక్
బనశంకరి: నగరంలో హెబ్బాళ జంక్షన్ అంటే ఎంత రద్దీగా ఉంటుందో తెలిసిందే. తెలుగు రాష్ట్రాల నుంచి బెంగళూరులోకి ఈ ప్రాంతం గుండానే ప్రవేశించాలి. దీంతో నిరంతరం ట్రాఫిక్ సమస్య ఉంటుంది. ఈ నేపథ్యంలో కాంప్రహెన్సివ్ ఇంటర్‌మోడల్ కనెక్టవిటీ అభివృద్ధి చేయాలని బీబీఎంపీ పాలనాధికారి ఎస్‌ఆర్ ఉమాశంకర్ తెలిపారు. గురువారం నగరంలోని అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. హెబ్బాళ జంక్షన్‌లో బీడీఏ మొదటి దశ ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్నాయని, అక్కడ ఫ్లై ఓవర్, అండర్‌పాస్, మెట్రో పనులు, సబర్బన్ రైల్వే ట్రాక్ పనులు, పాలికె సొరంగ మార్గం నిర్మాణంలో ఉన్నాయని, వీటిన్నింటిని సమగ్ర పథకంతో అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు. హెబ్బాళ జంక్షన్‌లో ట్రాఫిక్ రద్దీ నివారణకు మాస్టర్ ప్లాన్ రూపొందించి అమలు చేయాలన్నారు. బీడీఏ ఆధ్వర్యంలో కేఆర్ పురం వైపు నుంచి నగరం లోపలకు వెళ్లే ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్నాయని, వచ్చే మార్చిలోగా అది పూర్తి చేయాలని తెలిపారు. కెంపాపుర జంక్షన్‌లో చేపడుతున్న మెట్రో రైల్ పనులు, సిల్క్‌బోర్డు జంక్షన్‌లో రాజకాలువ, ఈజీపుర పై వంతెన పనులు, జయనగర బీడీఏ పనులను పరిశీలించారు. బీబీఎంపీ ప్రత్యేక కమిషనర్ అవినాశ్ మెనన్ రాజేంద్రన్, ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ ఎంఎన్.అనుచేత్, వలయ కమిషనర్లు పాల్గొన్నారు.
సమగ్ర అనుసంధాన వ్యవస్థ
ఏర్పాటుపై చర్చ
Comments
Please login to add a commentAdd a comment