దర్శన్ బెయిల్ అర్జీ విచారణ వాయిదా
బనశంకరి: రేణుకాస్వామి హత్యకేసులో అరైస్టె జైలుకెళ్లిన నటుడు దర్శన్ బెయిల్‌పిటిషన్ విచారణ మళ్లీ వాయిదాపడింది. శుక్రవారం నగర 57వ సీసీహెచ్‌కోర్టులో బెయిల్‌పై విచారణ జరిగింది. దర్శన్ తరఫున న్యాయవాది నాగేశ్ వాదనలు వినిపించారు. విచారణను శనివారం నాటికి వాయిదా వేస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.
కళాశాలలకు బాంబు బెదిరింపు
బనశంకరి: బెంగళూరు నగరంలోని హనుమంతనగర పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొన్ని కాలేజీల్లో బాంబు పెట్టినట్లు శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు ఇ–మెయిల్ పంపారు. సమాచారం అందుకున్న కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను బయటకు పంపి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బీఎంఎస్, రామయ్య, బీఐటీ కాలేజీతో పాటు కొన్ని కాలేజీల్లో హనుమంతనగర పోలీసులు బాంబు, డాగ్‌స్క్వాడ్‌తో వచ్చి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎలాంటి బాంబులు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా బాంబు బెదిరింపు ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురై కళాశాలల వద్దకు పరుగులు తీశారు.
ఢిల్లీలో సతీశ్, ఖర్గే రహస్య భేటీ
శివాజీనగర: బెళగావి కాంగ్రెస్ నేత, మంత్రి సతీశ్ జార్కిహొళి శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను భేటీ చేసి చర్చలు జరిపారు. ఈ భేటీ రహాస్యంగా జరిగింది. దీంతో ఇది కాంగ్రెస్‌లో ఊహాగానాలకు కారణమైంది. ముడా కేసులో చిక్కుకున్న సిద్దరామయ్యను ఒకవేళ కాంగ్రెస్ హైకమాండ్ తప్పిస్తే ఆ స్థానంలో దళిత నేతను సీఎం చేయాలనే అభిప్రాయాలను కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో సతీశ్ జార్కిహొళి ఖర్గేను భేటీ చేయడం, దీనికితోడు ఆయన గత వారం ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కూడా కలవడం ఊహాగానాలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా గత సంవత్సరం ఎన్నికలకు ముందుగా తాను సీఎం స్థానం ఆకాంక్షి కాదని, సీఎం స్థానం రేస్‌లో సిద్దరామయ్య, డీ.కే.శివకుమార్ ఉన్నారని సతీష్ జార్కిహొళి అన్నారు. ఇటీవల ముడా కేసు వెలుగులోకి వచ్చి సీఎం రాజీనామాకు ప్రతిపక్షాల ఒత్తి చేస్తున్నపుడు కూడా సతీశ్ జార్కిహొళి.. సిద్దరామయ్యయే సీఎంగా ముందుకు కొనసాగుతారు. అందులో ఎలాంటి మార్పులు జరుగవని తెలిపారు.
ఎలాంటి ప్రాధాన్యత లేదు
ఢిల్లీకి వెళ్లినపుడు తమ అధినాయకులు, పార్టీ అధ్యక్షులను భేటీ చేయటం సహజమని, దీనికి మరో ఆర్థం కల్పించాల్సిన అవసరం లేదని మంత్రి సతీశ్ జార్కిహొళి తెలిపారు. శుక్రవారం నిప్పాణిలో ప్రైవేట్ కాలేజీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీ పర్యాటన కొత్తది కాదని, హైకమాండ్‌ను భేటీ చేయటం సర్వసాధారణమన్నారు. రాష్ట్రంలో కొత్త సంచలన విషయాలు, మార్పులు ఏవీ లేవన్నారు. ఖర్గేతో ముడా కేసు గురించి ఎలాంటి చర్చ జరుగలేదన్నరు. తమ పార్టీ నుంచి సీఎంపై ఎలాంటి ఒత్తడి లేదన్నారు. రెండు నెలలుగా ప్రతిపక్షాలు మాత్రం రాజీనామాపై ఒత్తిడి చేస్తున్నాయని, అయితే కేసులపై చట్టబద్దమైన పోరాటం చేయాలని తీర్మానించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment