ఢిల్లీ పర్యటన ఖరారు కాలేదు
సాక్షి బళ్లారి: వచ్చే ఏడాది కూడా దసరా ఉత్సవాలను తానే ప్రారంభిస్తానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆయన శుక్రవారం కొప్పళ జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఒక సంవత్సరం పదవిలో ఉండేందుకు అవకాశం ఇవ్వాలని చాముండి కొండమీద సీఎం మాట్లాడటం పలు రకాలుగా చర్చకు దారి తీసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. తాను పదవిలో నుంచి దిగిపోతాను అనుకోవడంలో అర్థం లేదన్నారు. అక్టోబర్ 27, 28 తేదీల్లో తాను ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నానని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. తన ఢిల్లీ పర్యటన ఇంకా ఖరారు కాలేదన్నారు. హైకమాండ్‌ను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లడం లేదన్నారు. బసవరాజరాయరెడ్డి కుల గణన చేయడానికి సంబంధించి తన అభిప్రాయాన్ని చెప్పారన్నారు. ఈ విషయంపై కేబినెట్‌లో చర్చ జరగలేదన్నారు. అసెంబ్లీలో కూడా చర్చ జరగాలన్నారు. వెనుకబడిన వర్గాలమంత్రితో చర్చించిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్ర మంత్రి కుమారస్వామికి తాను అంటే భయమని, అందుకోసమే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. సతీష్ జార్కిహోళి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో చర్చించిన విషయాలపై పెడర్థాలు చేసుకోకూడదన్నారు. అంతర్గత రిజర్వేషన్ల అమలుకు సంబంధించి సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలపై కేబినెట్‌లో, పార్టీ నేతలతో చర్చిస్తామని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
నా ముఖ్యమంత్రి కుర్చీ పదిలం
కుమారస్వామికి నేనంటే భయం
సీఎం సిద్దరామయ్య వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment