ఎందుకు అరెస్టు చేస్తారు?
● రేవణ్ణపై జీటీ ఫైర్
మైసూరు: సీఎం సిద్దరామయ్య తనపై కక్ష తీర్చుకునేందుకు రాజకీయాలు చేశారు, ఓడించేందుకు ప్రయత్నించారు, అంతేకానీ తప్పుడు కేసులు బనాయించే పని మాత్రం చేయలేదని చాముండేశ్వరి నియోజకవర్గ జేడీఎస్ అసంతృప్త ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ పేర్కొన్నారు. హెచ్డీ కుమారస్వామి లేకుంటే జీటీ దేవెగౌడ కొడుకుతో కలిసి జైలుకెళ్లాల్సి వచ్చేదని ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఇలా స్పందించారు. తనపై ఎవరూ రాజకీయంగా ఫిర్యాదు చేయలేదన్నారు. తనపై ఏ కేసు ఉంది. ఏ కేసులో తనను అరెస్ట్ చేయబోయారో చూపించాలని రేవణ్ణను డిమాండ్ చేశారు. ఆయన ఎందుకు ఇలా మాట్లాడారో తెలియదన్నారు. బెళగావి అసెంబ్లీ సమావేశాల్లో రేవణ్ణని దీనిపై ప్రశ్నిస్తానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment