వేడుకలకు వచ్చి జలసమాధి
దొడ్డబళ్లాపురం: ఈత సరదా ముగ్గురు పురుష నర్సింగ్ విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకుంది. నదిలో మునిగి మరణించిన సంఘటన మంగళూరు వద్ద బెళ్తంగడి తాలూకా మూడుకోడి గ్రామంలో చోటుచేసుకుంది. లారెన్స్ ఫెర్నాండెజ్ (20), సూరజ్ (19), జైసన్ (19) మృతులు.
ఈతకు వెళ్లి..
వివరాలు.. ముగ్గురూ మంగళూరులో ఓ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నారు. అందరూ కూడా మంగళూరు ఇరుగుపొరుగు ప్రాంతాలకు చెందినవారు. వాల్టేర్ అనే వ్యక్తి ఇంట్లో సెమీ క్రిస్మస్ వేడుక ఉండడంతో వచ్చారు. బుధవారం సాయంత్రం వేడుక చూసుకుని సమీపంలోని బర్కజె డ్యాం వద్ద నదిలో ఈత కొట్టడానికి వెళ్లారు. ఈ క్రమంలో లోతైన చోట ముగ్గురూ మునిగిపోయారు. ఎంతసేపటికీ రాకపోవడంతో బంధువులు వెతుకుతూ వెళ్లగా బారేజ్ వద్ద బట్టలు, మొబైళ్లు కనిపించాయి. గురువారం ఉదయం డ్యాంలో పోలీసులు, ఫైర్ సిబ్బంది రబ్బరు బోట్లతో గాలించగా ముగ్గురి మృతదేహాలు బయటపడ్డాయి. తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మృతదేహాలను బెళ్తంగడి ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వేణూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
నదిలో ముగ్గురు యువకుల మృతి
మంగళూరు వద్ద విషాదం
Comments
Please login to add a commentAdd a comment