దివ్యాంగులను ప్రోత్సహించాలి
కోలారు: దివ్యాంగుల్లోని ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించాలని జిల్లా కానూను ప్రాధికార కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి సునీల్ ఎస్ హొసమని తెలిపారు. గురువారం నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా కానూను సేవల ప్రాధికార, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, దివ్యాంగుల సబలీకరణ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులు అనేక ఉత్పాదన ఆధారితలో అతి పెద్ద పాత్ర పోషిస్తున్నారని అన్నారు. పారా ఒలింపిక్ క్రీడలలో వికలాంగులు అపార సాధన చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దివ్యాంగుల పారా ఒలింపిక్ క్రీడలలో పాలు పంచుకునే అవకాశాన్ని కల్పించాలన్నారు. దివ్యాంగులు ప్రభుత్వ సౌలభ్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తహసీల్దార్ నయన మాట్లాడుతూ.. దివ్యాంగుల స్థానంలో మనం ఉండి ఆలోచించినప్పుడే వారి పనులను ప్రామాణికంగా చేసివ్వడానికి సాధ్యమవుతుందన్నారు. దివ్యాంగులు మనో ధైర్యంతో పోటీలలో పాల్గొని విజేతలు కావాలన్నారు. కార్యక్రమంలో దివ్యాంగులు, సీనియర్ సిటిజన్‌ల సబలీకరణ శాఖ అధికారి ఎం రమ్య, సమాచార శాఖ అధికారి మంజేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment