సీఎం ఢిల్లీ టూర్
బనశంకరి: సీఎం సిద్దరామయ్య గురువారం ఆకస్మికంగా ఢిల్లీకి వెళ్లారు. రెండురోజుల పాటు ఆయన ఢిల్లీలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుక్రవారం ఏఐసీసీ సమావేశాలు ఉండడంతో కాంగ్రెస్ పాలిత సీఎంలను పిలిపించారు. ఆయన హైకమాండ్ పెద్దలతో మంత్రి వర్గ విస్తరణ, కేపీసీసీ అధ్యక్షుని మార్పు వంటి అంశాలపై చర్చించనున్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం.
విచారణకు ముడా
మాజీ కమిషనర్
మైసూరు: సీఎం సిద్దరామయ్య భార్యకు ముడా ఇళ్ల స్థలాల పంపిణీ కేసులో ముడా మాజీ కమిషనర్ కాంతరాజును లోకాయుక్త అధికారులు విచారించారు. ఆయన గురువారం మైసూరు లోకాయుక్త ఎస్పీ ఆఫీసుకు వచ్చారు. ఎస్పీ టీజే ఉదేష్ విచారణ జరిపి కొంత సమాచారాన్ని సేకరించారు. కాంతరాజు విలేకరులతో 2017లో తాను ముడా కమిషనర్‌గా ఉన్నానని, అప్పుడు సిద్దరామయ్య భార్య పార్వతి పొందిన భూమికి ఇచ్చిన పరిహారంపై విచారణ జరిగిందన్నారు. 2017లో జరిగిన ప్రాధికార సమావేశంలో అభివృద్ధి చేయని భూమిని ఇవ్వాలని తీర్మానించామన్నారు. దీనిపై విచారణ జరిగిందన్నారు. కేసు దర్యాప్తులో ప్రగతిలో ఉన్నందున ఎక్కువగా మాట్లాడేందుకు వీలు కాదన్నారు.
నాణేలు, స్టాంపుల ప్రదర్శన
తుమకూరు: అరుదైన నాణేలు, తపాలా స్టాంప్‌ల ప్రదర్శన గురువారం తిపటూరులోని కళాశాలలో విద్యార్థులను ఆకట్టుకుంది. సేకరణకర్త హెచ్‌కే సతీష్, ప్రిన్సిపాల్ ఎస్.మహేశయ్య ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. కోర్టు ఉద్యోగి అయిన సతీష్ గత 20 ఏళ్లుగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సంచరించి అనేక అరుదైన నాణేలను, స్టాంప్‌లను సేకరించారన్నారు. ఇలాంటి ప్రదర్శనలతో విద్యార్థులకు పరిజ్ఞానం పెంపొందుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment