అధ్యక్ష స్థానానికి నామినేషన్
కోలారు: ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష స్థానానికి డిసెంబర్ 6న ఎన్నికలు జరుగుతుండటంతో అధ్యక్ష స్థానానికి గురువారం అజయ్‌కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. పరిషత్ స్థానానికి శ్రీనివాసరెడ్డి, కోశాధికారి స్థానానికి మురళీ మోహన్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మాట్లాడిన అజయ్‌కుమార్ తాను ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై తే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రామణికంగా కృషి చేస్తానని తెలిపారు. ఉద్యోగుల భవనం త్వరగా పూర్తి కావడానికి కృషి చేస్తానని తెలిపారు. కోలారు జిల్లా సంఘాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ సంఘంగా తీర్చిదిద్దుతానన్నారు. ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగితే సంతోషం లేదంటే తాను ప్రధాన పోటీదారు అవుతానన్నారు. ఈ సందర్భంగా సంఘం మాలూరు తాలూకా అధ్యక్షుడు మునేగౌడ, ముళబాగిలు అధ్యక్షుడు అరవింద్, మాజీ జిల్లా అధ్యక్షుడు కెఎస్ మంజునాథ్, మాజీ ప్రధాన కార్యదర్శి చౌడప్ప తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment