బనశంకరి: నకిలీ రికార్డుల్ని సృష్టించి వేలాది కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమి కబ్జా చేసి భారీ కట్టడాలను నిర్మించిన కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత ఎన్‌ఆర్.రమేశ్ గురువారం బీడీఏ కమిషనర్ , లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ బెంగళూరు దక్షిణ తాలూకా, బేగూరు హోబళి, అగర గ్రామ పరిధిలోని పలు నంబర్లలో మొత్తం 35.05 ఎకరాల భూములను బీడీఏ 1986–87 లో స్వాధీనం చేసుకుంది. యజమానులకు పరిహారం కూడా ఇచ్చిందని తెలిపారు. ఇక్కడ చదరపు అడుగు మార్కెట్ విలువ సుమారు రూ.70 వేలకు పైగా ధర పలుకుతుంది. ఈ విలువైన భూమిని ముగ్గురు ప్రభుత్వ భూకబ్జాదారులు బీడీఏలోని కొందరు అధికారుల సహకారంతో, భూమి మూల యజమానుల నుంచి అక్రమంగా జీపీఏ చేసుకున్నారని ఆరోపించారు. తరువాత రాజకీయ బలంతో సదరు భూములను తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేసుకుని విక్రయించారు. ఇప్పుడు అక్కడ భారీ వాణిజ్య కట్టడాలు, నివాసాలు కట్టుకున్నారని తెలిపారు. వేలాది కోట్ల విలువచేసే సుమారు 12 ఎకరాలకు పైగా భూములను కబ్జా చేశారన్నారు. తక్షణం కబ్జా భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు.
బీజేపీ నేత ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment