ఘనంగా కేవీకే స్వర్ణోత్సవాలు | Sakshi
Sakshi News home page

ఘనంగా కేవీకే స్వర్ణోత్సవాలు

Published Tue, May 7 2024 4:20 AM

ఘనంగా

వైరా: కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైరా కేవీకేలో సోమవారం స్వర్ణోత్సవాల వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ డాక్టర్‌ స్వర్ణలత, అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల డీన్‌ డాక్టర్‌ జె.హేమంత్‌కుమార్‌ మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నూతన సాంకేతిక విధానాలు, వంగడాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. అలాగే, పంటల్లో సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తన్నామని పేర్కొన్నారు. ఆతర్వాత జిల్లా వ్యవసాయాధికారి పి.విజయనిర్మల, జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి వేణుమనోహర్‌రావు మాట్లాడగా ఆర్‌ఈఏసీ సభ్యుడు టి.రాణాప్రతాప్‌, వైరా కేవీకే కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.రవికుమార్‌, డాక్టర్‌ జెస్సీ సునీత తదితరులు పాల్గొన్నారు

డిప్యూటీ సీఎం కారు తనిఖీ

బోనకల్‌: మండల కేంద్రంలోని చెక్‌పోస్ట్‌ వద్ద డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కారును పోలీసులు తనిఖీ చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డి తరఫున ప్రచారానికి సోమవారం ఆయన వచ్చారు. ఈ మేరకు కారును పోలీసులు తనిఖీ చేయగా భట్టి సహకరించారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, నాయకులు జెట్టి కుసుమకుమార్‌ తదితరులు ఆ సమయాన డిప్యూటీ సీఎం వెంట ఉన్నారు.

ఘనంగా కేవీకే  స్వర్ణోత్సవాలు
1/2

ఘనంగా కేవీకే స్వర్ణోత్సవాలు

ఘనంగా కేవీకే  స్వర్ణోత్సవాలు
2/2

ఘనంగా కేవీకే స్వర్ణోత్సవాలు

 
Advertisement
 
Advertisement