ఆడపడుచులకు అండగా ఉంటాం.. | Sakshi
Sakshi News home page

ఆడపడుచులకు అండగా ఉంటాం..

Published Tue, May 7 2024 4:20 AM

ఆడపడు

ఖమ్మంవన్‌టౌన్‌: రాష్ట్రంలోని ఆడపడుచులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని, సంక్షేమ పథకాలు అమలుచేస్తూ మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఖమ్మంలో సోమవారం మహిళా కాంగ్రెస్‌ జిల్లాస్థాయి ఆత్మీయ సమ్మేళనం జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య అధ్యక్షతన నిర్వహించగా.. పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇప్పటికే అందిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు మహిళల కోసం అమలుచేయనున్నట్లు చెప్పారు. కాగా, బీజేపీ మతం, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతుండగా, ఆ పార్టీ మళ్లీ గెలిస్తేనియంతపాలన వస్తుందని తెలిపారు. ఈమేరకు కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డిని గెలిపించి ప్రధానిగా రాహుల్‌గాంధీ ఎంపికకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఖమ్మం సహకారనగర్‌: ఎన్నికల కోడ్‌ ముగియగానే ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఖమ్మంలో పీఆర్‌టీయూ టీఎస్‌ విశ్రాంత ఉపాధ్యాయుల ఫోరం కన్వీనర్‌ మోతుకూరి మధు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిటైర్డ్‌ ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలపై దృష్టి సారిస్తామని, ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పై చర్చిస్తామని తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీలు మోహన్‌రెడ్డి, పూల రవీందర్‌ మాట్లాడగా మోతుకూరి మధు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న క్రమా న రిటైర్డ్‌ ఉద్యోగులంతా రఘురాంరెడ్డికి మద్దతు ఇస్తామని తెలిపారు. ఈసమావేశాల్లో డిప్యూటీ మేయర్‌ ఫాతిమా జోహరా, నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, పగడాల మంజుల, విజయబాయి, మహ్మద్‌ జావీద్‌, బాలసాని లక్ష్మీనారాయణ, విశ్రాంత ఉపాధ్యాయులు దామోధర్‌రెడ్డి, దుర్గారావు, చంద్రశేఖర్‌, వెంకటనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మంమయూరిసెంటర్‌: సెక్యులరిజం, ప్రజా స్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు భాగం హేమంతరావు కోరారు. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసిన బీజేపీ మరోమారు గెలిస్తే మరింత ప్రమాదమని తెలిపారు. కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థి రామసహయం రఘురాంరెడ్డి సోమవారం ఖమ్మంలోని సీపీఐ కార్యాలయానికి ఆ పార్టీ నాయకుల మద్దతు కోరారు. ఈ సందర్భంగా మహ్మద్‌ మౌలానా అధ్యక్షతన జరిగిన సభలో హేమంతరావు మాట్లాడుతూ పోరాటాలకు నెలవైన ఖమ్మంలో వామపక్షాల మద్దతుతో కాంగ్రెస్‌ గెలుపు ఖరారైనప్పటికీ.. అత్యధిక మెజార్టీ సాధనకు కమ్యూనిస్టుల సత్తా చాటాలని సూచించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌, నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, యర్రా బాబు, జానీమియా, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్‌, బీ.జీ.క్లెమెంట్‌, మహ్మద్‌ సలాం, స్వర్ణకుమారి, ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆడపడుచులకు అండగా ఉంటాం..
1/2

ఆడపడుచులకు అండగా ఉంటాం..

ఆడపడుచులకు అండగా ఉంటాం..
2/2

ఆడపడుచులకు అండగా ఉంటాం..

 
Advertisement
 
Advertisement