ఓటు వేసిన 5,964మంది | Sakshi
Sakshi News home page

ఓటు వేసిన 5,964మంది

Published Tue, May 7 2024 4:25 AM

ఓటు వేసిన 5,964మంది

ఖమ్మం సహకారనగర్‌: ఖమ్మం లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఉద్యోగులు సోమవారం నాటికి 3,633 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నారు. అలాగే, 85 ఏళ్లు పైబడిన వయోవృద్ధులు, దివ్యాంగులు, అత్యవసర సేవలకు సంబంధించి ఉద్యోగులు 2,331మంది ఓటు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు 5,964 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారని రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ వీ.పీ.గౌతమ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

పట్టభద్రుల స్థానానికి 13మంది నామినేషన్లు

నల్లగొండ: ఖమ్మం – వరంగల్‌ – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఐదో రోజైన సోమవారం 13 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి ఏనుగుల రాకేష్‌రెడ్డి, టీడీపీ నుంచి ముండ్ర మల్లికార్జునరావు, ధర్మ సమాజ్‌ పార్టీ నుంచి బరిగల దుర్గాప్రసాద్‌, నేషనల్‌ నవక్రాంతి పార్టీ నుంచి కర్ని రవి సమర్పించారు. అంతేకాక స్వతంత్రులగా పులిపాక సుజాత, చీదల్ల వెంకట సాంబశివరావు, చీదల్ల ఉమామహేశ్వరి, తాడిశెట్టి క్రాంతికుమార్‌, అయితగోని రాఘవేంద్ర, బక్క జడ్సన్‌, బుగ్గ శ్రీకాంత్‌, పాలకూరి అశోక్‌కుమార్‌, దేశగాని సాంబశివరావు తమ నామినేషన్లను అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి సీహెచ్‌.మహేందర్‌కు అందజేశారు.

 
Advertisement
 
Advertisement