కొనుగోలుదారుల్లా వచ్చి...
మూత తీస్తే దుర్వాసన
రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యాన టాస్క్‌ఫోర్స్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు రోహిత్‌రెడ్డి, పి.స్వాతి, పి.మనోజ్ కుమార్, బి.రతన్‌రావుతో కూడిన బృందం తనిఖీలు చేపట్టింది. కొనుగోలుదారుల మాదిరి అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రానికి వారు వెళ్లారు. అక్కడ వివరాలు ఆరా తీస్తూ కొంత మోతాదులతో తమకు పేస్ట్ కావాలని చెబుతూనే నాణ్యతను పరిశీలించగా దుర్వాసన వచ్చింది. అంతేకాక బాటిళ్లపై లేబుళ్లు ఉన్నా వాటిపై బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గడువు ఇతర వివరాలేమీ ముద్రించలేదు. అంతేకాక ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేకుండానే తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో నకిలీ పేస్ట్‌గా అనుమానంతో నమూనాలు సేకరించి రూ.1.32 లక్షల విలువైన 960 కేజీల అల్లం, వెల్లుల్లి మిశ్రమాన్ని సీజ్ చేశారు.
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా కేంద్రంలోని రిక్కాబజార్‌లో అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారుచేస్తున్న కేంద్రంలో పాడైన పదార్థాలు వాడుతున్నారని అధికారులకు ఫిర్యాదు అందింది. అయితే, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండదని అనుకున్నారో ఏమో కానీ సదరు వ్యక్తులు ఏకంగా రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ బృందం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్.వీ. కర్ణన్ ఆదేశాలతో సోమవారం ఇక్కడకు వచ్చిన ఓ బృందం తనిఖీలు చేపట్టగా వారికి అందిన ఫిర్యాదు నిజమేనని తేలింది.
కార్ఖానాలో కేన్సర్ కారకాలు
ఖమ్మం చర్చి కాంపౌండ్‌లోని విజయలక్ష్మి పిండి వంటల కార్ఖానాలో పరిశీలించగా పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. అలాగే, కేన్సర్ కారకాలైన రసాయన రంగులను అధిక మోతాదులో స్వీట్ల తయారీకి వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో రూ.6,550 విలువైన పిండి వంటలు, పచ్చళ్లను అక్కడికక్కడే ధ్వంసం చేసి శాంపిళ్లను పరీక్షలకు పంపించారు. ఇక మయూరిసెంటర్‌లోని స్వీట్ హోమ్‌లో తనిఖీ చేయగా పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేయడమే కాక అధిక మోతాదులో రసాయన రంగులను వాడినట్లు తేలింది. ఈమేరకు సుమారు రూ.6,950 విలువైన ఆహార పదార్థాలను ధ్వంసం చేసి నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ఆహార పదార్థాల తయారీలో నిబంధనలు పాటించకున్నా, అనుమతి తీసుకోకున్నా వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర టాస్క్ ఫోర్స్ టీం హెడ్ వి. జ్యోతిర్మయి తెలిపారు.
రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment