అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
ఖమ్మంవన్టౌన్: ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటానని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆయన పలువురి నుంచి వినతిపత్రాలు, దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేలా కృషి చేస్తానని చెప్పారు. అలాగే, నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం నుండి వీలైనంత మేర నిధులు తీసుకొస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు కొప్పుల చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ రఘురాంరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment