మార్కెట్‌లో పాత నిర్మాణాలు కూల్చివేత
● అధునాతన మిర్చి యార్డు నిర్మాణానికి శ్రీకారం ● త్వరలోనే రూ.155 కోట్ల పనులకు శంకుస్థాపన
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో అధునాతన మిర్చి యార్డు నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలోనే ఖమ్మం మార్కెట్‌లో అత్యధికంగా మిర్చి క్రయవిక్రయాలు జరుగుతుంటా యి. అయితే, సీజన్‌లో లక్షన్నర బస్తాల వరకు వస్తుండగా స్థలాభావంతో ఇక్కట్లు ఎదురవుతుండడాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఆధునిక యార్డు నిర్మాణానికి అనుమతులు జారీ చేసింది. ఆరు షెడ్లు, మధ్యలో కార్యాలయం(ఆన్‌లైన్ బిడ్డింగ్), కోల్డ్ స్టోరేజీ, చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్ తదితర నిర్మాణాలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో రూ.155 కోట్లు మంజూరయ్యా యి. మార్కెట్‌లోని మిర్చి యార్డు, అపరాల యార్డు, చైర్మన్, కార్యదర్శి చాంబర్లు తొలగించిన ఆ స్థానంలో అన్ని హంగులతో విశాలమైన యార్డులు నిర్మించనున్నారు. ఈనేపథ్యాన పాత నిర్మాణాల కూల్చివేత పనులు బుధవారం మొదలుపెట్టారు. ఏడు షెడ్లకు సంబంధించి పైకప్పు తొలగింపు పూర్తి చేయగా, మిర్చి క్రయవిక్రయాలను అపరాల యార్డులో చేపడుతున్నారు. సీజన్ జోరందుకుంటే పత్తి యార్డును కూడా వినియోగించుకోవాలని నిర్ణయించారు.
29తర్వాత శంకుస్థాపన
అధునాతన మార్కెట్‌యార్డు నిర్మాణ పనులకు ఈ నెల 29న తర్వాత శంకుస్థాపన చేసే అవకాశముంది. ఇప్పటికే అజిలిజీ సంస్థ ఆధ్వర్యాన డిజైన్లు కూడా రూపొందించారు. పనులకు శంకుస్థాపన చేసిన రోజు నే మార్కెట్ కొత్త పాలకవర్గం ప్రమాణస్వీకారం కూ డా ఉంటుందని సమాచారం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇతర మంత్రులు హాజరయ్యే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment