జూనియర్ కళాశాలల్లో రాగి జావ పంపిణీ
ఖమ్మం సహకారనగర్/వైరా: విద్యార్థుల్లో హిమోగ్లోబిన్ శాతం తగ్గుతుండడంతో జూని యర్ కళాశాలల్లో రాగి జావ పంపిణీకి ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈనేపథ్యాన జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 6వేల మంది విద్యార్థులకు ఉదయం వేళ 250 మి.లీ. చొప్పున జావ అందజేయనున్నారు. ఇందుకోసం అవసరమైన రూ.4లక్షలను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ విడుదల చేశారని డీఐఈఓ కె.రవిబాబు తెలిపారు. అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మధ్యాహ్న భోజన కార్మికుల ద్వారా, లేనిపక్షంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో విద్యార్థులకు జావ సమకూర్చేలా సామగ్రిని కళాశాలలకు పంపించినట్లు ఆయన వెల్లడించారు. కాగా, వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు రాగి జావ పంపిణీని బుధవారం ప్రిన్సిపాల్ ఎల్.నవీనజ్యోతి ప్రారంభించారు. వార్షిక పరీక్షలు మొదలయ్యే వరకు జావ అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలుర ఉన్నత పాఠశాల హెచ్‌ఎం మాధవరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.
జిల్లాలో 6వేల మంది విద్యార్థులకు లబ్ధి
Comments
Please login to add a commentAdd a comment