ఇందిరమ్మ కమిటీ సభ్యులపై దాడి
కారేపల్లి: కారేపల్లి మండలం మండలం కోమట్లగూడెం సభలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు కాపా చంద్రశేఖర్, వెంపటి రాంబాబు కావాలనే తమ వారికి ఇందిరమ్మ ఇళ్లు రాకుండా చేశారంటూ కాంగ్రెస్ నాయకులు ఈసాల వెంకన్న, గ్రామస్తులు నిలదీశారు. అంతేకాక వేదికపై ఎందుకు కూర్చున్నావని చంద్రశేఖర్‌ను నిలదీసే క్రమాన మండల ప్రత్యేకాధికారి డీసీఓ జి.గంగాధర్, ఎంపీడీఓ సురేందర్ సర్దిచెప్పారు. ఆతర్వాత మాటామాట పెరగడంతో స్టేజీపై కూర్చున్న చంద్రశేఖర్‌ను వెంకన్న నిలదీస్తుండగా ఘర్షణ జరిగింది. ఇదే మండలం రేలకాయలపల్లి, మాణిక్యారం, సీతారాంపురం, ఎర్రబోడు గ్రామసభల్లోనూ అనర్హుల పేర్లు జాబితాలో చేర్చారని, గుడిసెల్లో నివసిస్తున్న వారికి ఇళ్లు మంజూరు చేయలేదని ఆందోళనకు దిగారు. సీతారాంపురంలో ఇళ్ల కోసం 579మంది పేర్లు చదువుతుండగా ఎంపి కైన వారి పేర్లే చెప్పాలని నిలదీశారు. అయితే, గ్రామంలో 600ఇళ్లకు 579 మంది దరఖాస్తు చేసు కోవడంతో సర్వే చేశామంటూ అనర్హులు ఉంటే చెప్పాలని తహసీల్దార్ సంపత్‌కుమార్ సూచించడంతో తమలో తమకు తగవు పెటొద్దని పేర్కొన్నారు. దీంతో అభ్యంతరాలు వెల్లువెత్తడంతో తహసీల్దార్ వెళ్లిపోయారు. కాగా, కోమట్లగూడెంలో చంద్రశేఖర్‌పై దాడి చేసిన వెంకన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment