శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయాధికారి
ఆసిఫాబాద్‌రూరల్: వానాకాలం సాగుకు వర్షాలు అనుకూలంగా లేవని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వర్షం కురిసి 15నుంచి 20 ఇంచుల మేరకు నేల తడిసిన తర్వాత విత్తుకుంటేనే సాగు సవ్యంగా ఉంటుందని తెలిపారు. ఈ నెల 20 దాకా పత్తి సాగు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రకృతి సహకరించకుంటే కంది, జొన్న సాగు చేసుకోవాలని సూచించారు. సేంద్రియ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందవచ్చని వివరించారు. లోటు వర్షపాతం కారణంగా జిల్లా రైతాంగం ఇబ్బందులు పడుతుండగా జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సూచనలు చేశారు.
సాక్షి: వానాకాలం సాగుపై లోటు వర్షపాతం ఎలాంటి ప్రభావం చూపుతుంది?
డీఏవో: జిల్లాలో జూన్‌లో సగం వానలే కురిశా యి. లోటు వర్షపాతంతో విత్తనాలు సరిగా మొలకెత్తలేదు. రైతులు మరోసారి విత్తుతున్నారు. దీంతో పెట్టుబడి పెరగడమే కాకుండా దిగుబడిపై ప్రభావం పడనుంది.
సాక్షి: వరినార్లు ఎప్పటివరకు పోసుకోవచ్చు?
డీఏవో: నీటి వసతి ఉన్నవారు ఇప్పటికే వరినా ర్లు పోసుకున్నారు. లోటు వర్షపాతంతో చెరువులు, ప్రాజెక్టుల్లో నీరు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వరిలో స్వల్పకాలిక విత్తనాలను ఎంచుకుని ఆగస్టు వరకు నార్లు పోసుకోవచ్చు.
సాక్షి: రైతులకు సబ్సిడీపై ఏయే విత్తనాలు ఇస్తున్నారు?
డీఏవో: 100శాతం సబ్సిడీపై జిల్లా రైతులకు ఇప్పటికే కంది, సోయాబీన్ విత్తనాలు అందించాం.
సాక్షి: చిరుధాన్యాలు సాగు చేయాలని రైతులను ప్రోత్సహిస్తున్నారా?
డీఏవో: గతేడాది కలెక్టర్ చొరవతో రూ.15 లక్షల వరకు ఖర్చు చేసి జొన్న, కొర్రలు, సామలు తదితర రకాల చిరుధాన్యాల విత్తనాలను రైతులకు ఉచితంగా పంపిణీ చేశాం. కానీ.. అధిక వర్షపాతం పంటలపై ప్రభావం చూపి సాగు చేసిన రైతులు నష్టపోయారు. దీంతో ఈసారి చిరుధాన్యాల సాగుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇందుకు అనుకూలమైన నేలలు కూడా మన జిల్లాలో లేవు.
సాక్షి: వానాకాలం సాగుపై రైతులకు మీరిచ్చే సలహాలు, సూచనలు..?
డీఏవో: అవసరానికి మించి రసాయన ఎరువులు వాడొద్దు. పత్తి సాగుకు ముందు దుక్కిలో గాని, విత్తిన నాలుగురోజుల్లోపు గాని ఎకరాకు 30నుంచి 40 కేజీల డీఏపీ మాత్ర మే వాడాలి. విత్తనం మొలకెత్తాక డీఏపీ వేయొద్దు. పత్తి మొలకెత్తిన 20రోజులకు నేలలో మంచి తేమశాతం ఉన్నప్పుడు ఎకరాకు 20 నుంచి 30 కేజీల యూరియాలో 15 నుంచి 20 కేజీల పొటాష్ కలిపి సాగు కాలం పూర్తయ్యే దాకా మూడు లేదా నా లుగుసార్లు (25నుంచి 30రోజుల వ్యవధి లో) వేసుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వస్తుంది. సేంద్రియ ఎరువులతో భూసారం కూడా పెరుగుతుంది.
సాక్షి: నోవా ద్రవరూప యూరియా సాగుకు అనుకూలమేనా?
డీఏవో: ఈ సంవత్సరం నోవా ద్రవరూప యూ రియా వచ్చింది. ఎకరాకు లీటర్ చొప్పున వాడుకోవచ్చు. దీంతో రైతుకు పెట్టుబడి కూడా చాలా తక్కువ అవుతుంది. ఈ సంవత్సరం వాడితే గాని దాని ప్రయోజనం తెలియదు. ద్రవరూప యూరియాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
సాక్షి: జిల్లాలో వానాకాలంలో సాగయ్యే పంటలు.. సాగు విస్తీర్ణం?
డీఏవో: జిల్లాలో 4.51లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అత్యధికంగా 3,35,178 ఎకరాలో పత్తి, 54,611 ఎకరాల్లో వరి, 46,096 ఎకరాల్లో కంది, 3,017 ఎకరాల్లో పెసర, 1,524 ఎకరాల్లో సోయా సాగవుతోంది. వీటితోపాటు కూరగాయలు, పండ్ల్ల తోటలు కూడా సాగు చేస్తున్నారు.
సాక్షి: భూసారం పెంపునకు ఏం చేయాలి?
డీఏవో: భూసారం పెంచుకునేందుకు సాధ్యమైంత వరకు రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు వాడాలి. జిల్లాలో అ త్యధికంగా సాగు చేసే పత్తిలో అంతరపంటగా కంది, బబ్బెర, మినుము, మొక్కజొ న్న సాగు చేస్తే భూసారం పెరుగుతుంది. పంటల సాగులో ఎలాంటి సందేహాలున్నా సంబంధిత ఏఈవోలను సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment