ఉద్యమ స్ఫూర్తితో ప్రజల పక్షాన పోరాటం
ఆసిఫాబాఆద్అర్బన్: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రజల పక్షాన పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాసంలో బుధవారం దీక్షా దివస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 29న దీక్షా దివస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2009లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుని ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హా మీలను విస్మరించిందని ఆరోపించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆదిలాబాద్ జెడ్పీ మాజీ చైర్మన్ జనార్దన్, సింగిల్ విండో చైర్మన్లు సంజీవ్, అలీబిన్ అహ్మద్, మాజీ జెడ్పీటీసీలు అజయ్‌కుమార్, ద్రుపదాబాయి, మాజీ ఎంపీపీ సౌందర్య, నా యకులు రవి, రవీందర్, అన్సార్, నిసార్, సాజిద్, కలాం, హకీమ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment