విద్యాసంస్థల బంద్ విజయవంతం
వాంకిడిలో సంపూర్ణ బంద్
వాంకిడి(ఆసిఫాబాద్): విద్యార్థి సంఘాల నా యకులు, మాలి సంఘం నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం మండల కేంద్రంలో సంపూర్ణ బంద్ పాటించారు. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని చౌదరి శైలజ మృతికి కారకులైన వారిపై చర్యలు తీ సుకోవాలని, బాధిత కుటుంబానికి న్యా యం చేయాలని డిమాండ్ చేశారు. మాలి సంఘం నాయకులు ఉదయం నుంచే విద్యా సంస్థలు, దుకాణాలు, వ్యాపార సమూదాయాలను మూసివేయించారు. మాలి సంక్షేమ సంఘం నాయకులు జ్యోతిబా పూలే విగ్రహం వద్ద శైలజ మృతికి సంతాపం తెలిపారు.
ఆసిఫాబాద్‌రూరల్/ఆసిఫాబాద్: వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతి ఘటనను నిరసిస్తూ బుధవారం విద్యార్థి సంఘాల పిలుపు మేరకు చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. ఉదయమే విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ప్రభుత్వ కళాశాల విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ, విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. అనంతరం ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ శైలజ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే శైలజ మృతి చెందిందని ఆరోపించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన డీటీడీవో, ఏటీడబ్ల్యూవోలను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. శైలజ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంది రమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలన్నారు. సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవా లని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకో వాలన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు పూర్తిసౌకర్యాలు కల్పించి నాణ్యమైన భోజనం అందించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి కేస రి ఆంజనేయులు గౌడ్, విద్యార్థి సంఘాల నాయకులు ఆత్మకూరి చిరంజీవి, దుర్గం దిన్‌కర్, గొడిసెల కార్తీక్, టీకానంద్, అవుడపు ప్రణయ్, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట విద్యార్థి, యువజన సంఘాల ధర్నా
శైలజ కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment