మాదకద్రవ్యాల వినియోగంతో దుష్పరిణామాలు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్: మాదకద్రవ్యాల వినియోగంతో దుష్పరిణామాలు కలుగుతాయని, విద్యార్థులను వాటి వి నియోగం నుంచి దూరం చేయాలని కలెక్టర్ వెంకటే శ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ స మావేశ మందిరంలో బుధవారం జిల్లా సంక్షేమశా ఖ ఆధ్వర్యంలో నిషా ముక్త్ భారత్ అభియాన్ కా ర్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించేందుకు డ్రగ్‌పీస్ సొసైటీ ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు, విద్యార్థులకు దుష్పరిణామాలపై అవగాహన క ల్పించాలన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణకు అ న్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ప ని చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు ర్యాలీ లు, వ్యాసరచన పోటీలు, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు నిర్వహించాలన్నారు. విద్యాసంస్థలకు 200 మీ టర్ల దూరంలో ఎలాంటి పొగాకు ఉత్పత్తులు, మా దకద్రవ్యాల విక్రయాలు జరగకుండా పర్యవేక్షించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ ఆరోగ్య పథకం కింద ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ 14416 ఏర్పాటు చేశారని, ఆరోగ్య సంబంధిత అంశాలపై సందేహాలు, సేవల కోసం సంప్రదించాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారిని నోడల్ అధికారిగా నియమించామని, ప్రజలకు తెలిసేలా పోలీసు శాఖ అధికారుల సమన్వయంతో ఫెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మత్తు పదార్థాలు నిల్వ ఉన్నట్లు తెలిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. మాదకద్రవ్యాల నియంత్రణపై సామూహిక ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి భా స్కర్, డీపీవో భిక్షపతి గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి సజీవన్, మున్సిపల్ కమిషనర్ భుజంగరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment