పోడుకోసం చెట్లు నరికివేత
దండేపల్లి: మండలంలోని లింగాపూర్ అటవీ బీట్ పరిధిలో 380 కంపార్ట్మెంట్లో పోడు వ్యవసాయం కోసం కొందరు వ్యక్తులు ఆదివారం తెల్లవారుజామున సుమారు ఎకరం స్థలంలో సుమారు 70 చెట్లకు పైగా నరికివేశారు. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకునే లోపు వారంతా పారిపోయారు. ఈ విషయమై తాళ్లపేట ఎఫ్ఆర్వో సుష్మరావును వివరణ కోరగా అటవీ భూమిలో చెట్లు తొలగించిన విషయం వాస్తవమే, చెట్లను తొలగించినవారు దమ్మన్నపేటకు చెందిన వారిగా గుర్తించామన్నారు. వారందరికీ కౌన్సెలింగ్ ఇచ్చి అటవీ భూమిలో చెట్లను తొలగించొద్దని అవగాహన కల్పిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment