గిరిజనుడిని చితకబాదిన అధికారులు
వేమనపల్లి: గిరిజనుడిని అటవీ అధికారులు చితకబాదిన ఘటన మండలంలోని సుంపుటం అటవీ ప్రాంతంలోని రామలక్ష్మణుల గుట్ట వద్ద చోటుచేసుకుంది. బాధితుడు, కళ్లెంపల్లి గ్రామానికి చెందిన గిరిజనుడు కుస్రం రవీందర్ తెలిపిన వివరాలు.. ఈనెల 15న తన బావ ఆత్రం బక్కయ్యతో కలిసి రామలక్ష్మణుల గుట్ట వద్దకు చీపురు సేకరణ కోసం వెళ్లాను. అక్కడే ఉన్న తిరుమాను చెట్లకు లక్క ఉండటంతో చెట్టును నరికి సేకరించారు. సమాచారం అందుకున్న ఎఫ్‌ఎస్‌ఓ బేగ్, వేమనపల్లి ఎఫ్‌బీవో సోఫియాబేగం భర్త పాషా అక్కడికి వెళ్లారు. అధి కారులను చూసి బక్కయ్య పరుగెత్తగా రవీందర్‌ను అదుపులోకి తీసుకుని కొట్టారు. బైక్‌పై కుశ్నపల్లి అటవీ కార్యాలయానికి తరలించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితుడు తెలిపాడు. ఆదివారం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం, మాజీ ఎంపీపీ కుర్రు వెంకటేశంలతో కలిసి నీల్వాయి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రామలక్ష్మణుల గుట్ట వద్ద ఘటన
పోలీస్‌స్టేషన్‌లో ఇరువర్గాల ఫిర్యాదు
ఎలాంటి దాడి చేయలేదు
కళ్లంపల్లి గ్రామస్తులు గతేడాదిగా లక్క సేకరణ కోసం చెట్లను నరుకుతున్నారు. 15న అటవీ ప్రాంతానికి వెళ్లిన తమను చూసి అందరూ పరారయ్యారు. రవీందర్ పరుగెత్తగా కిందపడగా గాయాలయ్యాయి. అతడిపై దాడికి చేయలేదు. కేసు పెడతారనే నెపంతో దాడి చేసినట్లు వారు ఆరోపణ చేస్తున్నారు. కాగా, వేమనపల్లిలో తాను అద్దెకు ఉంటున్న ఇంటి వద్దకు వచ్చి కళ్లంపల్లి గ్రామస్తులు దాడికి యత్నించారని ఎఫ్‌బీఓ సోఫియాబేగం డీఆర్‌వో రూపేష్, భర్త పాషాతో కలిసి నీల్వాయి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. – బేగ్, ఎఫ్‌ఎస్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment