ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
నస్పూర్: సింగరేణిలో పని చేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతోటి నాగేశ్వర్‌రావు అన్నారు. నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులతో కలిసి మాట్లాడారు. కొత్తగూడెంలోని సింగరేణి కార్పొరేట్ కార్యాలయంలో ఈనెల 12న లైజర్ సెల్ ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. లైజర్ సెల్ ద్వారా ఎస్సీ ఎస్టీ, మైనార్టీ మహిళా కార్మికుల సమస్యల పరిష్కారం సులభతరం అవుతుందన్నారు. దీని ఏర్పాటుకు సహకరించిన ఎస్సీ ఎస్టీ మిషన్‌కు, సింగరేణి సీఎండీ బలరాం తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ కార్మిక సంఘం ఒకటే ఉందన్నారు. ఎవరు ఎలాంటి ప్రకటనలు చేసినా కార్మికులు అయోమయానికి గురికావొద్దన్నారు. త్వరలో అన్ని ఏరియాల్లో పర్యటించి కార్మికుల సమస్యలు తెలుసుకుంటామన్నారు. సమావేశంలో ఇరావుల శ్రీనివాస్ సెంట్రల్ కమిటీ మెంబర్, డేగల ప్రవీణ్‌కుమార్ వైస్ ప్రెసిడెంట్, నాయకులు అంద వెంకట్, లక్ష్మణ్, వేల్పుల ప్రవీణ్, వాసు, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment