వీడని భయం.. చదువుకు దూరం
● వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో పెరగని హాజరు ● ప్రస్తుతం ఉన్నది 136 మంది మాత్రమే.. ● ప్రత్యేక తరగతులకూ హాజరుకాని ‘పది’ విద్యార్థినులు ● రెగ్యులర్ హెచ్‌ఎం, వార్డెన్ లేక ఇబ్బందులు
వాంకిడి(ఆసిఫాబాద్): వాంకిడి మండల కేంద్రంలో ని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలోని 60 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురై 18 రో జులు గడిచినా పాఠశాల గాడిన పడటం లేదు. కలెక్టర్ ప్రత్యేక కమిటీని నియమించి విచారణ అనంతరం హెచ్‌ఎం శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశారు. మరో నలుగురు నాన్ టీచించ్ సిబ్బందిపైనా బదిలీ వేటు వేశారు. రెండు, మూడు రోజుల వ్యవధిలోనే విద్యార్థులు అనారోగ్యం బారిన పడటం, కొందరు తీవ్ర అస్వస్థతతో నిమ్స్‌లో చికిత్స పొందడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అప్పటి నుంచి ఒక్కొక్కరుగా వచ్చి తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. ఘటన తర్వాత 571 మందికి 95 మంది బా లికలు మాత్రమే మిగిలారు. హాస్టల్ నుంచి ఇళ్లకు వెళ్లిన పిల్లలను తిరిగి పాఠశాలకు పంపేందుకు తల్లి దండ్రులు భయపడుతున్నారు. ప్రస్తుతం 136 మంది విద్యార్థినులు మాత్రమే పాఠశాలలో ఉన్నారు.
నో హెచ్‌ఎం, నో వార్డెన్..
వసతిగృహం నిర్వహణలో హెచ్‌ఎం, వార్డెన్ పాత్ర కీలకం. హెచ్‌ఎంతోపాటు వార్డెన్‌గా విధులు నిర్వహించిన శ్రీనివాస్‌ను సస్పెండ్ చేసిన అనంతరం.. ఆ పోస్టుల్లో ఎవ్వరినీ నియమించలేదు. విద్యార్థినుల అస్వస్థతకు గురైన పదిరోజుల తర్వాత అధికార యంత్రాంగం విచారణ చేపట్టింది. రెండు రోజులపాటు జరిగిన విచారణ అనంతరం విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని హెచ్‌ఎంను సస్పెండ్ చేస్తూ ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత హెచ్‌ఎంను కానీ వార్డెన్‌ను కానీ నియమించలేదు. సీనియర్ ఉపాధ్యాయుడికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించగా.. సదరు ఉపాధ్యాయుడు నిరాకరించినట్లు తెలుస్తోంది. అలాగే వార్డె న్ ఇన్‌చార్జి బాధ్యతలు కూడా మరో టీచర్‌కు అప్పగించగా ఆ టీచర్ కూడా నిరాకరించినట్లు సమాచా రం. ప్రస్తుతం ఎప్పటికప్పుడు కూరగాయలు తీసుకొచ్చి విద్యార్థినులకు వంట చేస్తున్నారు. జీసీసీ నుంచి సరుకులు రవాణా నిలిచిపోయింది. ఉన్న సరుకులను స్టోర్ రూంలోనే తాళం వేసి ఉంచారు.
తిరిగిరాని విద్యార్థినులు
వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 571 అడ్మిషన్లు పొందిన విద్యార్థినుల్లో నిత్యం సుమారుగా 540 మంది వరకు వసతిగృహంలో ఉండేవారు. ప్రస్తుతం పాఠశాలలో 136 మంది మాత్రమే ఉన్నా రు. 60 మందికి పైగా ఆస్పత్రుల పాలు కాగా.. ఆ రోగ్యం విషమించిన జ్యోతి, మహాలక్ష్మి, శైలజను హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స అందించారు. ఇద్దరు కోలుకుని ఇంటికి రాగా మరో విద్యార్థిని శైలజ పరిస్థితి ఇప్పటికీ కుదుటపడలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను తిరిగి పాఠశాలకు పంపేందుకు భయపడుతున్నారు. అధికారులు సైతం వెంటనే చర్యలు తీసుకోకపోవడం, రెగ్యులర్ హెచ్‌ఎం, వార్డెన్‌ను నియమించకపోవడం తదితర కారణాలతో కూడా బాలికలు తిరిగి రావడం లేదని తెలుస్తోంది.
‘పది’ తరగతులపై సందిగ్ధం..
ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు మూడు వారాలు గడిచినా తిరిగి పాఠశాలకు రాకపోవడంతో నష్టపోతున్నారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థినులు సైతం చాలా మంది ఇంటి వద్దే ఉన్నారు. ఆశ్రమ పాఠశాలలో పదో తరగతిలో 56 మంది చదువుకుంటున్నారు. వారిలో ప్రస్తుతం 38 మంది మాత్రమే పాఠశాలలో ఉన్నారు. వందశాతం ఉత్తీర్ణత సాధించాల నే లక్ష్యంతో ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. 18 మంది ఇళ్లలోనే ఉండటంతో ప్రత్యేక తరగతులు, రోజువారీగా నిర్వహించే పరీక్షలకు హాజరుకావడం లేదు.
సీనియర్ టీచర్లకు బాధ్యతలు
వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాస్‌ను సస్పెండ్ చేసిన అనంతరం హెచ్‌ఎం, వార్డెన్ బాధ్యతను అక్కడే పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులకు అప్పగించాం. అస్వస్థతకు గురైన విద్యార్థినులు అందరూ కోలుకున్నారు. నిమ్స్‌లో చికి త్స పొందుతున్న శైలజ కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బాలి కలు తిరిగి పాఠశాలకు వచ్చేలా ప్రతిరోజూ ఫోన్‌లో మాట్లాడుతున్నాం. ఎస్‌సీఆర్పీలు ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు.
– రమాదేవి, డీటీడీవో
Comments
Please login to add a commentAdd a comment