ప్రశాంతంగా గ్రూప్– 3 పరీక్షలు
ఆసిఫాబాద్‌రూరల్/కాగజ్‌నగర్‌రూరల్: జిల్లాలో గ్రూపు– 3 మొదటిరెండు పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించారు. మొదటి పేపర్ ఉదయం 10 గంటలకు ఉండగా.. 8.30 నుంచి బయోమెట్రిక్ తీసుకుని లోపలికి వెళ్లేందుకు అనుమతించారు. ఆసిఫాబాద్ పట్టణంలో 9, కాగజ్‌నగర్ పట్టణంలో 9 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం నిర్వహించిన పేపర్– 1కు 4,471 మంది అభ్యర్థులకు 2,794 మంది హాజరు కాగా.. 1677 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరిగిన పేపర్ –2కు 2,779 మంది హాజరు కాగా 1,692 మంది గైర్హాజరయ్యారు. 62 శాతం మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం పేపర్– 3 నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు.
పరీక్ష కేంద్రాలు పరిశీలన
జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ, పీటీజీ గురుకుల పాఠశాల, కాగజ్‌నగర్‌లోని సెయింట్ మేరీ పాఠశాల, వివేకానంద డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పరిశీలించారు. అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓఎంఆర్ షీట్లను బందోబస్తు మధ్య స్ట్రాంగ్‌రూంకు తరలిస్తామని తెలిపారు. సోమవారం నిర్వహించే మూడో పేపర్ కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయన వెంట కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, అధికారులు ఉన్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్‌తోపాటు పలు కేంద్రాలను ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సందర్శించారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం స్ట్రాంగ్ రూంకు ఓఎంఆర్ షీట్ల తరలింపుపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. డీఎస్పీ రామానుజం ఆధ్వర్యంలో గ్రూపు– 3 పరీక్షలు రాసేందుకు వచ్చే అభ్యర్థులకు కాగజ్‌నగర్ బస్టాండ్ నుంచి కేంద్రాల వరకు ఉచిత వాహన సౌకర్యం కల్పించారు.
నిమిషం నిబంధనతో వెనక్కి..
గ్రూపు– 3 పరీక్షకు ప్రభుత్వం నిమిషం నిబంధన ను అమలు చేయడంతో జిల్లాలో ఎనిమిది మంది అభ్యర్థులు పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు. ఆ సిఫాబాద్ పట్టణంలోని పీటీజీ గురుకుల పాఠశాలలోని కేంద్రానికి ఇద్దరు, సెయింట్ మేరీ పాఠశాలకు ఇద్దరు, కాగజ్‌నగర్‌లోని వసుంధర కళాశాలకు ఒక రు, జవహర్ నవోదయ విద్యాలయంలోని కేంద్రానికి ముగ్గురు ఆలస్యంగా వచ్చారు. అభ్యర్థులు అధి కారులను బతిమాలినా లోపలికి పంపించలేదు.
ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లో కేంద్రాల ఏర్పాటు
పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ
నిమిషం నిబంధనతో పరీక్షకు పలువురు దూరం
Comments
Please login to add a commentAdd a comment