పింఛన్లు పెంచాలని నిరసన
ఆసిఫాబాద్‌అర్బన్: దివ్యాంగుల పింఛన్ రూ. 4,016 నుంచి రూ.6వేలకు, వృద్ధులు, వితంతువులు, ఇతర చేయూత పెన్షన్లు రూ.2,016 నుంచి రూ.4వేలకు పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. వీహెచ్‌పీఎస్ రాష్ట్ర నాయకులు ఇస్లాం బిన్ హసన్, జిల్లా అధ్యక్షుడు మూర్తి మాట్లాడుతూ వికలాంగుల హక్కుల చట్టం– 2016 రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని, వికలాంగుల సంక్షేమ శాఖను స్వతంత్రంగా ఉంచుతూ జీవో నం.34 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 5శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలన్నారు. దివ్యాంగుల హక్కుల సాధన కోసం ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద చేయూత పెన్షన్‌దారుల మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని వికలాంగులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శ్రీనివాస్, రాజయ్య, గోపాల్, అన్నాజీ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment