కోర్టు ద్వారా ఫిర్యాదుల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

కోర్టు ద్వారా ఫిర్యాదుల పరిష్కారం

Published Tue, Nov 19 2024 12:14 AM | Last Updated on Tue, Nov 19 2024 12:14 AM

కోర్టు ద్వారా ఫిర్యాదుల పరిష్కారం

కోర్టు ద్వారా ఫిర్యాదుల పరిష్కారం

ఆసిఫాబాద్‌అర్బన్‌: సివిల్‌ ఫిర్యాదులకు కోర్టు ద్వా రానే పరిష్కారం లభిస్తుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం ఆరు ఫిర్యాదులు రాగా.. చట్టప్రకారం వా టిని పరిష్కరించాలని సీఐ, ఎస్సైలను ఆదేశించా రు. ఎస్పీ మాట్లాడుతూ భూములకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. అధికారులు ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. సైబర్‌ నేరాలు పెరుగుతు న్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సమయంలో డయల్‌ 100 లేదా 1930 నంబర్లకు సమాచారం అందించాలని ఆయన కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement