వ్యక్తిగత మరుగుదొడ్డి తప్పనిసరి
ఆసిఫాబాద్: ప్రజారోగ్యం దృష్ట్యా ప్రతీ కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్డి తప్పనిసరి గా నిర్మించుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో వరల్డ్ టాయిలెట్ డే పోస్టర్ ను సోమవారం కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, జిల్లా అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ పథకంలో భాగంగా గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలన్నారు. ప్రజలందరూ ఇళ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, వ్యక్తిగత పరిశుభ్రత అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్బీఎం జిల్లా సమన్వయ కర్త నజర్ అహ్మద్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment