సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెబాట
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రభుత్వం 15 రోజుల్లోగా చర్చలకు పిలిచి గతంలో ఇచ్చిన హామీలు అమలుచేయని పక్షంలో సమ్మెబాట పడతా మని సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కొప్పుల మోహన్ అన్నా రు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవా రం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్, డీఈవో కా ర్యాలయాల్లో సమ్మె నోటీసు అందించారు. ఆ యన మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, ప్రతీ ఉద్యోగికి జీవిత బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాల ని, ఉద్యోగ విరమణ అనంతరం బెనిఫిట్స్ కింద రూ.25 లక్షలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నగేశ్, సందీప్, అనూప్‌కుమార్, రాజ్‌కుమార్, రాజేశ్, వెంకటరమణ, మల్లేశ్, అంబారావు ఉన్నా రు.
Comments
Please login to add a commentAdd a comment