పకడ్బందీగా వాహనాల తనిఖీ
వాంకిడి(ఆసిఫాబాద్): జిల్లా సరిహద్దులోని చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని సరిహద్దు చెక్‌పోస్టులను మంగళవా రం తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ అదనంగా ఇస్తున్నందున ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేపడుతూ ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా నియంత్రించాలని ఆదేశించారు. సిబ్బంది షిఫ్టుల వారీగా 24 గంటలు తనిఖీ చేపట్టాలన్నారు. జిల్లా నుంచి పత్తితో వెళ్లే వాహనాల పత్రాలు పరిశీలించాలని, అనుమతులు లేకుంటే సరిహద్దు దాటనివ్వొదన్నారు. ఆయన వెంట తహసీల్దార్ రియాజ్ అలీ, ఎస్సై ప్రశాంత్ తదితరులు ఉన్నారు.
నాణ్యమైన ఆహారం అందించాలి
వసతిగృహంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాలతో కూడిన ఆహారం అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ను మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజనం, గదులు, వంటశాల, మూ త్రశాలలు, పరిసరాలను పరిశీలించారు. నాణ్య మైన సరుకులు వినియోగించాలని, కాలం చెల్లిన సరుకులు వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చలి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డీటీడీవో రమాదేవి, తహసీల్దార్ రియాజ్ అలీ, ఎస్సై ప్రశాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment