పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం
తిర్యాణి(ఆసిఫాబాద్): పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని డీఆర్‌డీవో దత్తారావు అన్నారు. ప్రపంచ టాయిలెట్ దినోత్సవం సందర్భంగా మంగళవారం మండలంలోని గడలపల్లి గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బహిరంగ మలమూత్ర విసర్జన ద్వారా రోగాలు సంక్రమిస్తాయన్నారు. స్వచ్ఛ్ భారత్ మిషన్ కింద ప్రభుత్వం రూ.12వేల ప్రోత్సాహం అందిస్తుందని, ప్రతిఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గోయోగాంలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించారు. మట్టి నింపడంలో కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో వేముల మల్లేశ్, ఎస్బీఎం జిల్లా కోఆర్డినేటర్ ఫాణి, ఏపీఎం సదానందం, ఏపీవో షాకీర్ ఉస్మాని, నాయకులు సార రమేశ్‌గౌడ్, మడావి గుణవంత్‌రావు, ఈసీ రజిత, టీఏలు ఓడిగ సాగర్, ముత్తినేని సాగర్, జయ తదితరులు ఉన్నారు.
డీఆర్‌డీవో దత్తారావు
Comments
Please login to add a commentAdd a comment