మోతాదుకు మించి యాంటిబయాటిక్స్ వాడొద్దు
వాంకిడి(ఆసిఫాబాద్): యాంటిబయాటిక్స్ మోతా దుకు మించి వాడొద్దని ఆరోగ్య విస్తరణ అధికారి పెందూర్ రవిదాస్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో మంగళవారం సూక్ష్మ జీవుల నిరోధక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం వారం రోజులపాటు కొనసాగుతుందని తెలిపారు. సూక్ష్మజీవులతో దుష్పరిణామాలు, వ్యక్తిగత శుభ్రత, యాంటిబయాటిక్స్ వినియోగం, తదితర అంశాలపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తామన్నారు. అనంతరం వైద్యసిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పీహెచ్ఎన్ క్రిష్టియానా, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment