‘కార్మిక సంఘాలపై ఆంక్షలు సరికాదు’
ఆసిఫాబాద్‌అర్బన్: ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఆంక్షలు సరికాదని, ప్రభుత్వం తక్షణమే స్పందించి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ నిర్వహణలో కార్మిక సంఘాలకు భాగస్వామ్యం కల్పించాలన్నారు. క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించా లని కోరారు. కార్మికులపై వేధింపులు ఆపాల ని, ప్రజల అవసరాల మేరకు బస్సుల సంఖ్య పెంచాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు వెలిశాల కృష్ణమాచారి, తోట సమ్మయ్య, మాట్ల రాజు ఉన్నారు.
విద్యార్థులకు అవగాహన
కాగజ్‌నగర్‌రూరల్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు కంపెనీ సెక్రటరీ కోర్సుపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ అధికారి శ్రీనివాస్, ఎం.ప్రవీణ్‌కుమార్ విద్యార్థులకు కంపెనీ సెక్రటరీ కోర్సుపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం వివిధ కంపెనీలు వాటి కార్యక్రమ నిర్వహణ కోసం కంపెనీ సెక్రటరీలను నియమించుకుంటున్నాయని తెలిపారు. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి మాట్లాడుతూ విద్యార్థులు కంపెనీ సెక్రటరీ కోర్సు ద్వారా ఎన్నో అవకాశాలు అందుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు లక్ష్మీనరసింహం, జనార్దన్, రాజేశ్వర్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
మీసేవ కేంద్రం అనుమతి రద్దు
ఆసిఫాబాద్: జైనూర్ మండల కేంద్రంలోని సయ్యద్ ముబారక్‌కు చెందిన మీసేవ కేంద్రం అనుమతి రద్దు చేసినట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులకు రశీదు ఇవ్వకపోవడం, నిర్ణీత ధరల కంటే అధికంగా డబ్బులు వసూలు చేయడం, ధరల పట్టిక ప్రదర్శించకపోవడంతో పాటు ఇతర నిబంధనలు ఉల్లంఘించినట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. మీ సేవ కేంద్రం, ఆధార్ పీఈసీ అనుమతులు రద్దు చేశామని తెలిపారు.
దివ్యాంగుల కమిటీ ఏర్పాటుకు దరఖాస్తులు
ఆసిఫాబాద్‌అర్బన్: రాష్ట్ర దివ్యాంగుల హక్కు ల నియమావళి– 2018, దివ్యాంగుల హక్కు ల చట్టం– 2016 ప్రకారం దివ్యాంగుల జిల్లా కమిటీ ఏర్పాటు కోసం అర్హులైన వికలాంగు ల నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నామని జిల్లా సంక్షేమశాఖ అధికారి ఆడెపు భాస్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి కేటగి రిలో దివ్యాంగుల సమస్యలు, సేవల కోసం పనిచేసే ప్రభుత్వ గుర్తింపు ఉన్న స్వచ్ఛంద సంస్థ నుంచి ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన అభ్యర్థి, ఒకరు మహిళా అభ్యర్థి, మరో ముగ్గు రు సభ్యులు ఉండాలని, రెండో కేటగిరిలో వికలాంగుల సమస్యలపై అవగాహన, సేవా దృక్పథం ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన అభ్యర్థి, ఒకరు మహిళా అభ్యర్థి, మరో ముగ్గు రు సభ్యులు ఉండాలని తెలిపారు. అర్హులు ఈ నెల 30 సాయంత్రం 5 గంటల లోగా ధ్రువపత్రాలతో జిల్లా సంక్షేమశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత పరిశీలించిన అనంతరం జిల్లా కమిటీని ఎంపిక చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment