సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమాలు
● వచ్చేనెల 7 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు ● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభి వృద్ధి పథకాలు ప్రజలకు తెలిసేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరే ట్ వద్ద సాంస్కృతిక కార్యక్రమాల వాహనాన్ని మంగళవారం ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19 నుంచి డిసెంబర్ 7 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. మహిళలకు ఉచిత బస్సు, రైతు రుణమాఫీ, మహాలక్ష్మి, గృహజ్యోతి, వంటగ్యాస్ రాయితీ, ఉద్యోగ నియామకాలు, మహిళాశక్తి, ఇతర అభివృద్ధి, సంక్షేమ పథకా లపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో జిల్లావ్యాప్తంగా ప్రచారం నిర్వహించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ అధికారులు, తహసీల్దార్లు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ నెల 23న జిల్లా కేంద్రంలో హైదరాబాద్‌కు చెందిన 80 మంది సాంస్కృతిక కళాకారుల బృందం సభ్యులు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. సంబంధిత అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి వై.సంపత్ కుమార్, కలెక్టరేట్ సిబ్బంది, సాంస్కృతిక కళాకారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment