నవ చరితకు స్వచ్ఛ చల్లపల్లి నాంది | - | Sakshi
Sakshi News home page

నవ చరితకు స్వచ్ఛ చల్లపల్లి నాంది

Published Tue, Feb 13 2024 1:28 AM | Last Updated on Tue, Feb 13 2024 1:28 AM

- - Sakshi

చల్లపల్లి(అవనిగడ్డ): స్వచ్ఛ భారత్‌ చరిత్రలో చల్లపల్లి గ్రామం నవ చరితకు నాంది పలకబోతోందని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుడితి రాజశేఖర్‌ పేర్కొన్నారు. సోమ వారం సాయంత్రం పంచాయతీ డంపింగ్‌ యార్డ్‌ను మూసివేసి రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాలిడ్‌ లిక్విడ్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజశేఖర్‌, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గంధం చంద్రుడు, కృష్ణా జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు హాజరయ్యారు. గ్రామ డంపింగ్‌ యార్డులో నాలుగు రోజులుగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ అడ్వైజర్‌, పర్యావరణవేత్త వేలేరు శ్రీనివాసన్‌ పర్యవేక్షణలో పారిశుద్ధ్య కార్మికులు, మన కోసం మనం ట్రస్ట్‌ సిబ్బంది, స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలు శ్రమించి ఏర్పాటు చేసిన డ్రై లీవ్స్‌ కంపోస్ట్‌ పిట్‌ను ప్రారంభించారు. సేకరణ దశలోనే పొడి చెత్తను విభజించి తరలించేందుకు రూపొందించిన ప్రత్యేక రిక్షాను జెండా ఊపి ప్రారంభించారు. చెత్త విభజనకు వేలేరు శ్రీనివాసన్‌ రూపొందించిన విధానాలు పరిశీలించారు. అనంతరం డంపింగ్‌ యార్డ్‌ను మూసివేసి, ఎస్‌ఎల్‌ఆర్‌ఎంను ప్రారంభించారు.

మరో అంబికాపూర్‌ కావాలి

ఎస్‌ఎల్‌ఆర్‌ఎం కార్యక్రమం దేశంలోనే మొదటి సారి చేపట్టిన ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని అంబికాపూర్‌ మునిసిపాలిటీ స్థాయిలో చల్లపల్లి పేరు తెచ్చుకోవా లని ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజశేఖర్‌ ఆకాంక్షించారు. పదేళ్లుగా స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమం నిర్వహిస్తున్న డాక్టర్‌ డి.ఆర్‌.కె.ప్రసాద్‌, డాక్టర్‌ టి.పద్మావతి దంపతులు, సర్పంచ్‌ పైడిపాముల కృష్ణకుమారి, పంచా యతీ ఈఓ పేర్ని మాధవేంద్రరావు, స్వచ్ఛ కార్యకర్తలు, మన కోసం మనం ట్రస్ట్‌ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల కృషితో ఎస్‌ఎల్‌ఆర్‌ఎం నూరు శాతం విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ గంధం చంద్రుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని గ్రామాలు డంపింగ్‌ యార్డ్‌ రహితంగా మారి, ఎస్‌ఎల్‌ఆర్‌ఎం కార్యక్రమం అమలు చేయాలని సూచించారు. 15 వేల చెత్త సేకరణ వాహనాలు కొనుగోలు చేసి గ్రామాలకు అందించేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ సిద్ధంగా ఉందన్నారు. కలెక్టర్‌ రాజాబాబు మాట్లాడుతూ.. ఎస్‌ఎల్‌ఆర్‌ఎం నిర్వహణలో భాగస్వాము లైన డీఆర్కే దంపతులు, స్వచ్ఛ కార్యకర్తలను అభినందించారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ.. పదేళ్లుగా డీఆర్కే దంపతులు, స్వచ్ఛ కార్యకర్తలు నిబద్ధతతో స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం నిర్వహించడం స్ఫూర్తిదాయకమన్నారు. దేశంలో ఎన్నో గ్రామాల్లో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాలు మొదలైనా చల్లపల్లిలో మాత్రమే కొనసాగడానికి కార్యకర్తల సేవాభావమే కారణమన్నారు. డీపీఓ నాగేశ్వర్‌ నాయక్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా, డివిజన్‌, మండల, గ్రామ అధికారులు, స్వచ్ఛ కార్యకర్తలు, గ్రామ వలంటీర్లు పాల్గొన్నారు.

ఎస్‌ఎల్‌ఆర్‌ఎం ప్రోగ్రామ్‌తో చల్లపల్లి గ్రామంలో సమూల మార్పులు రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజశేఖర్‌ చల్లపల్లిలో డంపింగ్‌ యార్డ్‌నుమూసివేసి ఎస్‌ఎల్‌ఆర్‌ఎం ప్రారంభం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement