పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవుదాం
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని గనులు, భూ గర్భవనరులు, ఎకై ్సజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. మచిలీపట్నం మండలం చినపోతేపల్లి గ్రామంలో రైతు సేవా కేంద్రం వద్ద జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణపై నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో కలెక్టర్ డి.కె.బాలాజీతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కియోస్క్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి రవీంద్ర మాట్లాడుతూ.. నేటి సమాజంలో మనిషి పుట్టుకతోనే ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరిగిందని, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నందున వాటిని సేకరించి పర్యావర ణానికి ముప్పు రాకుండా కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా యంత్రాంగం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ కార్యక్రమం చేపట్టిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో చెత్త నుంచి కంపోస్ట్ ఎరువును తయారుచేసి పంచాయతీకి సంపద సమకూరేలా చర్యలు తీసుకుంటు న్నా మని పేర్కొన్నారు. పోతేపల్లి గ్రామంలో జ్యూయలరీ పార్కు కారణంగా భూగర్భ జలాలు కలుషితమయ్యాయని, త్వరలో నీటిశుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేయటంతో పాటు డ్రెయినేజీ వ్యవస్థను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 11 టన్నులకు పైగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించడానికి తీసుకున్న చర్యలపై కలెక్టర్ బాలాజీ, పంచాయతీ అధికారులను ఆయన అభినందించారు.
నిరంతర ప్రక్రియ
కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. జిల్లాలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ నిరంతర ప్రక్రియగా కొనసాగేలా పది మేజర్ పంచాయతీల్లో కియోస్క్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యర్థాలను సేకరించినందుకు హోం ల్యాండ్ ఎన్విరో ఇంజినీర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు జిల్లాకు ఎక్స్‌లెన్స్ సర్టిఫికెట్‌ను అందించారన్నారు. ఉత్పత్తిదారుడే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువును రీసైక్లింగ్ చేసే బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ క్రమంలో ఆయా కంపెనీలు రీసైక్లింగ్ కోసం ఏజెన్సీలతో ఒప్పందం కుదర్చుకుని రీసైక్లింగ్ ప్రక్రియను ప్రారంభించాయన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, డీపీఓ జె.అరుణ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కొల్లు రవీంద్ర
Comments
Please login to add a commentAdd a comment