సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజాపాలన అని పొద్దుకు పదిమార్లు ప్రగల్భాలు పలికెటోళ్లు అంటూ కాంగ్రెస్ నేతలపై సెటైర్లు వేశారు. అలాగే, తెలంగాణ ప్రాజెక్టుల మీద విషం కక్కి రాష్ట్రాన్ని ఆగంపట్టించినవాళ్లు అంటూ మండిపడ్డారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా ట్విట్టర్ వేదికగా..
అంచనాలను పెంచారని హాహాకారాలు చేసినోళ్లు, అవినీతి జరిగిందని బురదజల్లిన వాళ్లు
కాళేశ్వరం మీద కక్షగట్టిన రైతుల పొట్టగొట్టినవాళ్లు
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల మీద పగబట్టి మళ్ళి వలసలకు పచ్చజెండా ఉపినవాళ్లు
తెలంగాణ ప్రాజెక్టుల మీద విషం కక్కి రాష్ట్రాన్ని ఆగంపట్టించినవాళ్లు
ప్రజాపాలన అని పొద్దుకు పదిమార్లు ప్రగల్భాలు పలికెటోళ్లు
సీతారామ ఎత్తిపోతల పథకంలో అనుమతులు లేకుండానే రూ.1074 కోట్ల పనులకు టెండర్లు ఎలా పిలిచారు
సుద్దపూస ముచ్చట్లు చెప్పే మీరు ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీల పనుల్లో నిబంధలు ఎలా తుంగలో తొక్కారు
ఒక మీటింగ్ లో త్వరగా టెండర్లు పిలవాలి అని ఆదేశం - మరో మీటింగ్ లో ఇదేంటి అంటూ నంగనాచి మాటలు
ప్రాజెక్టు పూర్తి అయ్యి కోటి ఏకరాలకు జీవం పోస్తున్న కాళేశ్వరం పై కమిషన్ లు వేసి విచారణ చేస్తున్న మీపై ఇప్పుడు ఏ కమిషన్ వెయ్యాలి
ఢిల్లీ నేస్తం - అవినీతి హస్తం అంటూ ఘాటు విమర్శలు చేశారు.
అంచనాలను పెంచారని హాహాకారాలు చేసినోళ్లు, అవినీతి జరిగిందని బురదజల్లిన వాళ్లు
కాళేశ్వరం మీద కక్షగట్టిన రైతుల పొట్టగొట్టినవాళ్లు
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల మీద పగబట్టి మళ్ళి వలసలకు పచ్చజెండా ఉపినవాళ్లు
తెలంగాణ ప్రాజెక్టుల మీద విషం కక్కి రాష్ట్రాన్ని ఆగంపట్టించినవాళ్లు… pic.twitter.com/GnZDblFR77— KTR (@KTRBRS) November 3, 2024
Comments
Please login to add a commentAdd a comment