కృష్ణాజిల్లా
సోమవారం శ్రీ 4 శ్రీ నవంబర్ శ్రీ 2024
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో అనుమతులు లేకుండా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు యథేచ్ఛగా నడుస్తున్నాయి. శుద్ధిచేసిన నీటి పేరుతో విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ అనుమతులు లేకుండా సేవా ట్రస్ట్‌ల పేరుతో వాటర్ ప్లాంట్లు ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు అక్రమ వ్యాపారానికి తెరలేపుతున్నారు. ముఖ్యంగా వాటర్ ప్యాకెట్లతో పాటు 200 మిల్లీలీటర్లు, అర లీటరు, లీటర్ బాటిళ్లలో తాగునీరు అంటూ విక్రయిస్తున్నారు. తొలుత సేవా ట్రస్ట్‌ల పేరుతో ప్లాంట్లు ఏర్పాటు చేసి 20 లీటర్ల క్యాన్లను విక్రయిస్తున్నారు. ఆ తరువాత రాత్రి సమయాల్లో ఎటువంటి అనుమతులు, లైసెన్సులు లేకుండా వాటర్ ప్యాకెట్లు, బాటిల్స్ తయారు చేస్తున్నారు. ఈ నీటిని తాగితే ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని నిపు ణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పరీక్షలు చేయ కుండా తయారు చేసే నీరు విషంతో సమానమని హెచ్చరిస్తున్నారు. నిత్యం ల్యాబ్‌ల ద్వారా పరీక్షలు చేసి అనంతరం ప్యాకేజ్డ్ వాటర్‌ను తయారు చేయాల్సి ఉంది. అయితే ఈ విధంగా ఎక్కడా జర గటం లేదు. జిల్లాలో కేవలం రెండు చోట్ల మాత్రమే బీఎస్‌ఐ లైసెన్సు, వీఐఎస్ (ఐఎస్‌ఐ) లైసెన్సు, ఫుడ్ లైసెన్సుతో ప్లాంట్లు నడుస్తున్నాయి. అయితే అనుమతులు లేకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 14 ప్లాంట్ల ద్వారా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ విక్రయాలు సాగుతున్నాయి.
కొరవడిన అధికారుల తనిఖీలు, పర్యవేక్షణ
జిల్లాలో అక్రమంగా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ విక్రయాలు జరుపుతున్న రెవెన్యూ, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టడం, పర్యవేక్షణ కొరవడింది. జిల్లాలో కేవలం రెండు ప్లాంట్లు మాత్రమే అనుమ తులతో విక్రయాలు జరుపుతున్నారు. 14 ప్లాంట్లు ఎటువంటి అనుమతులు లేకుండా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను తయారుచేసి విక్రయాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటువంటి ఆర్వో ప్లాంట్లపై ఉన్నతాధికారలు తక్షణమే తనిఖీల నిర్వహించాలని ప్రజారోగ్యాన్ని కాపాడాలని పలువురు ప్రజలు కోరుతున్నారు.
న్యూస్‌రీల్
సేవా ట్రస్ట్‌ల పేరుతోపుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంట్లు అక్రమంగా వాటర్ ప్యాకెట్లు, బాటిళ్ల తయారీ బీఐఎస్, ఫుడ్ లైసెన్సులులేకుండానే ప్లాంట్ల ఏర్పాటు ఈ నీటితో ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం కొరవడిన అధికారుల తనిఖీలు, పర్యవేక్షణ
పాటించాల్సిన నిబంధనలు ఇవీ..
అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండెడ్స్, ఫుడ్ సేఫ్టీ అనుమతులు లేని ప్యాకేజ్డ్ డ్రింకింగ్ తాగితే అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ఈ నీటిని తాగితే శరీరానికి అందాల్సిన పోషకాలు సమకూరవు. అంతేకాకుండా కీళ్ల జబ్బులు, కిడ్నీ వ్యాధులు సోకి నీరసించిపోతారు.
– డాక్టర్ బి.శ్రీనివాసాచార్య, ఇండియన్
మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment