చేపల మావుల చిరునామా పెంజెండ్ర
గుడ్లవల్లేరు: కోస్తాంధ్ర వ్యాప్తంగా పంట కాలువల్లో చేపలు పట్టే వారికి ‘మావులు’ జీవనాధారంగా ఉంటున్నాయి. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలంలోని పెంజెండ్ర గ్రామం వీటి తయారీకి కేంద్రంగా విరాజిల్లుతోంది. వ్యవసాయంతో ముడిపడిన పరిశ్రమల్లో మావుల తయారీ ఒకటి. పంట బోదెల్లో పారుతున్న నీటిలో చేప లను వేటాడేందుకు ఇవి ఉపకరిస్తాయి. వందేళ్లగా వీరు చాకచక్యంగా అల్లుతున్న మావుల్లో నుంచి పాల పరిగ వంటి చిన్న చేప కూడా తప్పుకునే అవకాశం ఉండదు. సన్నం మావులైతే జత రూ.2,400, గల్లీల మావులైతే జత రూ.2 వేల చొప్పున అమ్ముతున్నారు. ఇక్కడి ముస్లిం కుటుంబాల్లోని పెద్దలు, మహిళలు, పిల్లలు, యువతీ యువకులు ఒకరేమిటీ.. ఆరేళ్ల నుంచి 60 ఏళ్ల వారంతా కార్మికులుగా ఈ ఇంటింటా కుటీర పరిశ్రమ పైనే ఆధారపడుతున్నారు. మగవారు మావులు అల్లితే, ఆడవారు ఇంటి వద్దనే మగ్గం బద్ద మీద మావులకు వాడే తడికలు అల్లుతున్నారు. వీటిని కొనుగోలు చేసేందుకు కోస్తాంధ్ర వ్యాప్తంగా ఉన్న పల్లెల నుంచి జాలర్లతో పాటు రైతులు కూడా వచ్చి హాట్ కేకుల్లా కొనుగోలు చేసుకెళ్తున్నారు.
శతాబ్దకాలంగా మావుల తయారీనేగ్రామస్తులకు జీవనాధారం చేపల బుట్టల తయారీకి ప్రసిద్ధి కోస్తాంధ్ర వ్యాప్తంగా ఇక్కడి నుంచి ఆర్డర్లు
Comments
Please login to add a commentAdd a comment