డిమాండ్‌ను బట్టి ధర
మైలవరం నియోజకవర్గానికి ప్రభుత్వం సరఫరా చేసే ఇసుకను కొనాలంటే దూర ప్రాంతాలకు ఎక్కువ ధర చెల్లించాల్సి రావడంతో స్థానికంగా వాగులలో ఉన్న ఇసుకను వాడుకునేందుకు స్థానికులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో అక్రమార్కులు డిమాండ్‌ను బట్టి ట్రాక్టరు ట్రక్కు ఇసుక రూ.2500 నుంచి రూ.4 వేలకు విక్రయిస్తున్నారు. కృష్ణానదిలో నీటి ప్రవాహం కూడా ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఫలితంగా నది ఇసుక రవాణా సక్రమంగా జరగకడంలేదు. రహదారులు పూర్తిగా ధ్వంసమై నది ఇసుక గ్రామాలకు వచ్చే అవకాశం కూడా లేకపోవడంతో స్థానికంగా వాగుల్లో ఉన్న ఇసుకకు డిమాండ్ పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment