దసరా ఉత్సవాలకు కొత్త సమస్య
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ష్ట్రంలో రెండో అతి పెద్ద ఆలయంగా ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి (దసరా) ఉత్సవాలు ఏటా కనులపండువగా జరుగుతాయి. ఈ ఏడాది ఉత్సవాల ఏర్పాట్లు దాదాపుగా కొలిక్కి వస్తున్నా శాఖల మధ్య సమన్వయం అంశంలో అయోమయం నెలకొంది. ఈ ఉత్సవాల్లో భాగస్వాములవుతున్న అన్ని శాఖల ఉన్నతాధికారులు కొత్తవారు కావటం, ప్రధానంగా దుర్గగుడిలో పని చేసే అధికారులు, సిబ్బందిని ఉత్సవాల వేళ బదిలీ చేయటం, ప్రజాప్రతినిధులు సైతం కొత్త ఎన్నికై న వారు కావడంతో గందరగోళం నెలకొంది. ప్రభుత్వం ఈ ఉత్సవాలను రాజకీయ కోణంలో మాత్రమే చూస్తోందని, భక్తులకు పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలనే భావనలో లేదనే విషయాన్ని బదిలీలు, ఇతర అంశాలు స్పష్టం చేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి ఉత్సవాలపై చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఇష్ట మొచ్చిన నిర్ణయాలతో గందరగోళ పరిస్థితులను సృష్టిస్తోందని దేవదాయ శాఖలోని కొంతమంది అధికారులే విమర్శిస్తున్నారు.
అన్ని శాఖల అధికారులకు ఉత్సవాలు కొత్తే
సుమారు 13 శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే శరన్నవరాత్రి వేడుకలు విజయవంతమవుతాయి. ఉత్సవాల నిర్వహణలో దేవదాయ, ధర్మదాయ శాఖ, పోలీసు, రెవెన్యూ శాఖ పాత్ర ప్రధానం. సీఐ, ఏసీపీతో పాటు పోలీస్ కమిషనర్ ఉత్సవాలకు కొత్తవారే. రెవెన్యూ విభాగానికి వస్తే కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర కీలక హోదాల్లో ఉన్న అందరూ కొత్తగా బాధ్యతలు తీసుకున్నవారే. దేవదాయ శాఖకు వస్తే ఆలయ కార్యనిర్వహణాధికారి గత దసరా ఉత్సవాల సమయంలో బాధ్యతలు స్వీకరించారు. నగర పాలక సంస్థ కమిషనర్ సైతం కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారే. వారంతా దసరా ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అనుభవం కలిగిన వారు కాదు. ఈ నేపథ్యంలో కొత్త అధికారులు తీసుకునే నిర్ణయాలు దసరా ఉత్సవాలపై ఏ విధమైన ప్రభావం చూపుతాయోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు.
దుర్గగుడి అధికారుల బదిలీలపై విమర్శలు
దసరా ఉత్సవాల్లో ఇతర ప్రాంతాలకు చెందిన దేవదాయ శాఖ సిబ్బంది వంద నుంచి రెండు వందల మంది దుర్గగుడికి డెప్యూటేషన్‌పై వచ్చి విధులు నిర్వర్తిస్తారు. అయితే ఉత్సవాల సమయంలో కీలకంగా పనిచేసే దుర్గగుడి అధికా రులు, సిబ్బందిని బదిలీ చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఇద్దరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, పలువురు సూపరింటెం డెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లను వివిధ ఆలయాలకు నాలుగు రోజుల క్రితం బదిలీ చేస్తూ దేవదాయ శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. ఒక వేళ వారిని డెప్యూటేషన్‌పై ఉత్సవాల వరకు ఇక్కడి విధుల్లోనే కొనసాగించినా వారు ఎంత వరకు బాధ్యత తీసుకుంటా రనేది ప్రశ్నార్థకమే. ప్రసాదాలు, అన్నదానం వంటి విషయాల్లో సీనియార్టీ ఉన్న అధికారులను ఇప్పుడు బదిలీ చేయటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ప్రజాప్రతినిధులు సైతం కొత్తవారే..
ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు సైతం కొత్తవారే కావటంతో ఏర్పాట్లపై భక్తులు పెదవి విరుస్తున్నారు. ప్రధానంగా స్థానిక ఎమ్మెల్యే సుజనాచౌదరి, ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ముగ్గురు ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడటమే తప్పా సొంతంగా ఉత్సవాల ఏర్పాట్లపై నిర్ణయాలు చేసి అవకాశం లేదు. వారికి సూచనలు ఇవ్వటానికి ఉన్న అధికారులూ కొత్తవారే. ఉన్న కీలకమైన అధికారులు బదిలీల్లో ఉన్నారు.
వారివే ఉత్సవాల్లో నిర్ణయాలు
పోలీసు శాఖలో గతంలో ఇక్కడ పని చేసిన ఒక సీఐ స్థాయి అధికారి, కొత్తగా నగరానికి వచ్చిన ఏడీసీపీ అధికారులే మొత్తం ఉత్సవాలకు సంబంధించి పోలీసు బాస్‌కు సూచనలు చేస్తున్నారని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన డీసీపీ స్థాయి అధికారి దసరా ఉత్సవ ఏర్పాట్ల సమావేశాలకు హాజరవుతున్నారు. ఎమ్మెల్యే సుజనాచౌదరి కానూరులో తన ఇంటిలో మీటింగ్ అంటూ అధికారులందరినీ అక్కడకు రావాలంటే పిలిచారు. మరో రోజు దేవదాయ కమిషనర్ కార్యాలయం, ఇంకొక రోజు కలెక్టర్ కార్యాలయం, ఆదివారం ప్రెస్ మీట్ పేరుతో పోలీసు కమిషనర్ కార్యాలయం ఇలా గడిచిన వారం పది రోజుల్లో సమావేశాల పేరుతో సగం సమయం గడిచిపోయిందని, క్షేత్ర స్థాయిలో ఉండకుండా అటుఇటు పరుగులు పెట్టిస్తున్నారంటూ అధికారులు వాపోతున్నారు.
అన్ని శాఖల్లోనూ కొత్తగా వచ్చిన అధికారులకే బాధ్యతలు క్షేత్రస్థాయిలో నిర్ణయం తీసుకునే వారు లేకుండా వేడుకలు ఇటీవల దుర్గగుడిలో 20 మందికి పైగా ఉద్యోగుల బదిలీలు ఉత్సవాలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని భక్తుల విమర్శలు
ఇబ్బందులు తప్పవంటున్న భక్తులు
ఉత్సవాల వేళ ఇంజినీరింగ్ విభాగంలో బదిలీలు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల వర్షాలకు ఘాట్‌రోడ్డులో కొండరాళ్లు విరిగి పడి ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు భక్తులు బయటకు వెళ్లే మల్లేశ్వరస్వామి దేవస్థానం దిగువన తాత్కాలికంగా ఐరన్ మెట్లను ఏర్పాటు చేసి ఉత్సవాలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. అక్కడ భక్తుల రద్దీ పెరిగితే కొంత ఇబ్బందులు తప్పవని ఆలయంలోని సీనియర్ ఉద్యోగులు చెబుతున్నారు. ఆలయం చుట్టూ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీ అధికమై, వర్షాలు కురిస్తే వెంటనే నిర్ణయాలు తీసుకో వటానికి అనుభవం కలిగిన ఇంజినీరింగ్ అధికారులు అవసరం. అయితే బదిలీల వ్యవహారంతో ఇబ్బందులు తప్పవన్న ఆందోళన నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment