మత్స్యకారుల సంక్షేమానికి కృషి
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
కృత్తివెన్ను: మత్స్యకారుల అభ్యున్నతికి, సంక్షేమానికి కృషి చేస్తామని ఎంపీ వల్లభనేని బాల శౌరి అన్నారు. ఓఎన్‌జీసీ సంస్థ సీఎస్‌ఆర్ నిధులతో మంగళవారం మత్స్యకారులకు ఐస్ బాక్సుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌తో కలసి పాల్గొన్నారు. ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ.. తీరప్రాంతమైన కృత్తివెన్ను మండలంలో మత్స్యకారులు అధికంగా ఉన్నారని, వారి అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అన్ని రకాల సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మండలంలోని ఒర్లగొందితిప్ప, గరిశపూడి, ఇంతేరు గ్రామాలకు చెందిన 61 మంది మత్స్యకారులకు ఐస్‌బాక్సులను అందజేసినట్లు ఏడీఎఫ్ నాగబాబు తెలిపారు. అనంతరం ఎంపీ, ఎమ్యేల్యేలు పలువురు లబ్ధిదారులకు ఫించన్‌ల పంపిణీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీఓ డి.నాగాంజని తదితరులు పాల్గొన్నారు.
క్రీడా పోటీల్లో సత్తాచాటిన బీబీఏ న్యాయవాదులు
విజయవాడస్పోర్ట్స్: న్యాయవాదులకు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) న్యాయవాదులు సత్తా చాటారు. రాజమండ్రిలో గత నెల 28, 29 తేదీల్లో పలు క్రీడాంశాల్లో జరిగిన ఈ పోటీలకు బీబీఏ నుంచి పది మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారు. క్యారమ్స్ సింగిల్స్ విన్నర్ ట్రోఫీని సీనియర్ న్యాయవాది కె.కుమారశ్రీనివాస్, డబుల్స్ విన్నర్ ట్రోఫీని పులిమాల రాణా, జాన్ విక్టర్, రన్నర్ ట్రోఫీని కె.కుమారశ్రీనివాస్, ఎస్.సత్యానందరావు, చెస్ విన్నర్ ట్రోఫీని మరీదు శ్రీనివాసరావు, బ్యాడ్మింటన్ సింగిల్స్ విన్నర్ ట్రోఫీని ఎస్.లత, రన్నర్ ట్రోఫీని బి.వి.అరుణదేవి, బ్యాడ్మింటన్ డబుల్స్ రన్నర్ ట్రోఫీని బి.వి.అరుణదేవి, ఎస్.లత కై వసం చేసుకున్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను బీబీఏ అధ్యక్షకార్యదర్శులు కొత్త చంద్ర మౌళి, అరిగెల శివరామప్రసాద్(రాజా) బీబీఏ హాల్‌లో మంగళవారం అభినందించి ఘనంగా సత్కరించారు.
పింఛన్ల పంపిణీ 97.76 శాతం పూర్తి
చిలకలపూడి(మచిలీపట్నం): ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా జిల్లాలోని సామాజిక పింఛన్ల లబ్ధిదారులకు మంగళవారం నగదు పంపిణీచేశారు. తొలి రోజు 97.76 శాతం పింఛన్ల పంపిణీ జరిగింది. జిల్లా వ్యాప్తంగా 2,39,264 మంది లబ్ధిదారులండగా 2,33,890 మందికి పింఛన్లు అందాయి. గుడివాడ పట్టణం, పెడన, గన్నవరం మండలాలు పింఛన్ల పంపిణీలో వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment