జాతీయ స్థాయిలో గుడ్లవల్లేరు విద్యార్థులకు బహుమతులు | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయిలో గుడ్లవల్లేరు విద్యార్థులకు బహుమతులు

Published Wed, Oct 2 2024 3:12 AM | Last Updated on Wed, Oct 2 2024 3:12 AM

జాతీయ స్థాయిలో గుడ్లవల్లేరు విద్యార్థులకు బహుమతులు

జాతీయ స్థాయిలో గుడ్లవల్లేరు విద్యార్థులకు బహుమతులు

గుడ్లవల్లేరు: జాతీయ స్థాయి టెక్నికల్‌ ఫెస్ట్‌లో గుడ్లవల్లేరు ఏఏఎన్‌ఎం అండ్‌ వీవీఆర్‌ఎస్‌ఆర్‌ పాలిటెక్నిక్‌ విద్యార్థులు బహుమతులు సాధించి విజయ ఢంకా మోగించారు. ఈ విషయాన్ని ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఎన్‌.రాజశేఖర్‌ మంగళవారం విలేకరులకు తెలిపారు. విజయవాడ ఆంధ్ర లయోల కాలేజీ ఆఫ్‌ ఇంజినీ రింగ్‌ అండ్‌ టెక్నాలజీలో గత నెల 28వ తేదీన ఇంజి నీరింగ్‌, బీప్లొమా విద్యార్థులకు జాతీయ స్థాయి టెక్నికల్‌ ఫెస్ట్‌ ఎపిస్టెమికాన్‌ – 2024 జరిగిందని తెలిపారు. టెక్నికల్‌ క్విజ్‌లో ఈసీఈ విద్యార్థులు కె.రాజు, ఐ.నరేంద్రరెడ్డికి ద్వితీయం, సీహెచ్‌ జగదీష్‌ కుమార్‌, ఎ.సాయి శర్వన్‌కు తృతీయం, మెకానికల్‌ విద్యార్థులు డి.మణికంఠ, జి.శ్యామ్‌ కిషోర్‌, ఐ.ఎన్‌. గోపాల్‌, సి.జగదీశ్వర్‌కు ద్వితీయం, ఏఐఎంఎల్‌లో కె.నిర్మల, కె.గణేష్‌ నాయక్‌ ద్వితీయ బహుమతులను గెలుపొందారని పేర్కొన్నారు. పోస్టర్‌ ప్రజెంటేషన్‌లో ఈసీఈ విద్యార్థి ఆర్‌.విష్ణు వర్ధన్‌, మెకానికల్‌ విద్యార్థి ఎం.శ్యామ్‌కు ద్వితీయం, కంప్యూటర్స్‌లో ఎస్‌.కె.శ్రీ, బి.పవన్‌, ఏఐఎంఎల్‌లో ఎం.బి.తిరుపతమ్మ, డి.సుమంత్‌కు తృతీయ స్థానాలు లభించాయన్నారు. స్టూడెంట్స్‌ అటెండన్స్‌ మానేజ్‌మెంట్‌ సిస్టం అంశంపై కంప్యూటర్స్‌కు చెందిన కె.వి.రామాంజనేయులు, ఎం.ఎల్‌.ప్రశాంత్‌కు ప్రథమం, ఎల్‌డీఆర్‌ సోలార్‌ డిపార్ట్‌మెంట్‌ సోలార్‌ ట్రాకర్‌పై మెకానికల్‌కు చెందిన ఇ.వి.చందన్‌, ఎ.హెచ్‌.నాగభరత్‌కు ద్వితీయం, పవర్‌ జనరేషన్‌ యూజింగ్‌ రెనేవబుల్‌ సోర్సెస్‌పై ఈసీఈకి చెందిన ఎ.వి.ఎస్‌.అక్షయ్‌, సీహెచ్‌.వి.సాయి అయ్యప్ప, ఎ.కృష్ణతేజకు తృతీయ స్థానాలు లభించినట్లు పేర్కొన్నారు. విజేతలతో పాటు వారికి శిక్షణ ఇచ్చిన విభాగాధిపతులు, అధ్యాపకులను కాలేజీ చైర్మన్‌ డాక్టర్‌ వల్లూరుపల్లి నాగేశ్వరరావు, కార్యదర్శి వల్లూరుపల్లి సత్యనారాయణ, సహ కార్యదర్శి వల్లూరుపల్లి రామకృష్ణ, మెంటార్‌ ఎన్‌.ఎస్‌.ఎస్‌.వి.రామాంజనేయులు, కో–ఆర్డినేటర్‌ జి.వి.వి.సత్యనారాయణ అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement