రేపటి నుంచి ఏపీ అంతర్ జిల్లాల రెజ్లింగ్ టోర్నీ
విజయవాడరూరల్: ఈ నెల మూడు నుంచి ఐదో తేదీ వరకు 68వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్‌ఏపీ) అంతర్ జిల్లాల రెజ్లింగ్ టోర్నీ జరుగుతుందని ఎస్‌జీఎఫ్ ఏపీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, నున్న జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం వజ్రాల భూపాల్‌రెడ్డి మంగళవారం తెలిపారు. అండర్ –14, 19 బాల బాలికల ఫ్రీ స్టైల్, అండర్–17, 19 బాలుర గ్రీకో రోమన్ విభాగంలో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల నుంచి సుమారు వెయ్యి మంది క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు, సాంకేతిక నిపుణులు ఈ పోటీలకు హాజరవుతారని వివరించారు. ఈ పోటీలను స్థానిక సాయిబాబా గుడి సమీపంలోని అశోక ఫంక్షన్ హాల్‌లో జరుగుతాయని తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో పాల్గొనే క్రీడాకారులు, అధికారులకు ఉచిత వసతి ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ టోర్నీని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ అధ్యక్షతన మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభిస్తారని, ఎంపీ వల్లభనేని బాలశౌరి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, ఎన్టీఆర్ కలెక్టర్ డాక్టర్ జి.సృజన, డీఈఓ యు.వి.సుబ్బారావు తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సితార సెంటర్ వద్ద మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. సితార సెంటర్ ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి ఒంటిపై వైట్ బ్లూ కలర్ చెక్స్ షర్ట్, వైట్ కలర్ లుంగీ ఉన్నాయి. మృతుడి వయసు 52 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment