వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఏపీ టీఈటీ –2024 ఆన్‌లైన్ పరీక్షలు ఈ నెల మూడు నుంచి 21వ తేదీ వరకు జరుగుతాయని ఎన్టీఆర్ జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు తెలిపారు. శ్రీవాహిని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, (తిరువూరు), పొట్టిశ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (విజయవాడ), ఐయాన్ డిజిటల్ జోన్ (కండ్రిక, విజయవాడ), ఎస్వీ ఇన్‌ఫోటెక్ (రామమందిరం రోడ్డు విజయవాడ), లైఫ్ బ్రిడ్జి ఇన్‌ఫో టెక్నాలజీస్ (గొల్లపూడి విజయవాడ), శ్రీ విజయదుర్గా ఐటీ ఇన్‌ఫో సొల్యూషన్స్ (ఎనికేపాడు విజయవాడ రూరల్), స్వర్ణభారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఖమ్మం), దారిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఖమ్మం), విజయ ఇంజినీరింగ్ కాలేజ్ (ఖమ్మం) తదితర కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు గంట ముందుగా తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టంచేశారు. హాల్ టికెట్‌లో ఫొటో లేకపోతే లేటెస్ట్ ఫొటో, గుర్తింపు కార్డుతో హాజరుకావాలని సూచించారు. పీహెచ్‌సీ అభ్యర్థులు దరఖాస్తులో పొందుపరచనివారు తమ వైకల్య ధ్రువీకరణ పత్రం, ఆన్‌లైన్‌లో పూరించే సమయంలోనూ పొరపాటున పీహెచ్‌సీ నమోదు చేయని పక్షంలో ఎన్టీఆర్ జల్లా పాఠశాల విద్యాశాఖాధికారి అనుమతితో సహాయకుడిని పొందవచ్చని సూచించారు. అభ్యర్థులు ఎటువంటి ఎల క్ట్రానిక్ పరికరాలను, సెల్‌ఫోన్‌ను తీసుకొని రాకూడ దని స్పష్టంచేశారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దీనికి సంబంధించిన కంట్రోల్ రూమ్ కొనసాగుతోందని, ఉదయం ఏడున్నర నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ పని చేస్తుందని వివరించారు. హెల్ఫ్‌లైన్ నంబర్లు 87902 58661, 94405 06411కు పరీక్ష రోజుల్లో సంప్రదించొచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment