తీర్చిదిద్దుతాం
బందరును మహానగరంగా
మచిలీపట్నంటౌన్: కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నాన్ని మహానగరంగా తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ గంగాధరరావులతో కలిసి ఆయన నగరంలోని 28వ డివిజన్‌లో లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. పచ్చమేడ సెంటర్‌లోని గౌస్ మహమ్మదీన్‌కు వికలాంగ, బీబీ జాన్‌కు వృద్ధాప్య, అమృతపురంలోని షాహీనాకు డయాలసిస్, తాడంకి సంజీవరావులకు వృద్ధాప్య పింఛన్లను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బందరు పోర్టు పనులు సీఎం చంద్రబాబు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. అలాగే ఆయిల్ రిఫైనరీ సైతం మచిలీపట్నంలో ఏర్పాటు చేసేందుకు బీపీసీఎల్ సన్నద్ధమవుతోందన్నారు. వర్షాలు వస్తే ప్రధాన రహదారులు నీటితో నిండుతున్నాయని ఈ సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో నగర కమిషనర్ బాపిరాజు, మునిసిపల్ మాజీ చైర్మన్ ఎంవీ బాబాప్రసాద్, మాజీ కౌన్సిలర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, 28వ డివిజన్ టీడీపీ ఇన్‌చార్జ్ ఆరిఫ్, టీడీపీ నగర అధ్యక్షుడు ఇలియాస్‌పాషా తదితరులు పాల్గొన్నారు.
పింఛన్ల పంపిణీలో మంత్రి కొల్లు రవీంద్ర
Comments
Please login to add a commentAdd a comment